https://oktelugu.com/

Anand Mahindra : మాటంటే మాటే.. మహీంద్రా థార్ ఇచ్చేశాడు.. ఇండియన్ క్రికెటర్ మోములో ఆనందం నింపేశాడు

అయితే ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. నౌషద్ ఖాన్ గొప్పతనాన్ని ప్రశంసించాడు. అతడు ఒప్పుకుంటే మహీంద్రా థార్ ను బహుమతిగా అందిస్తానని ప్రకటించాడు. మహీంద్రా విజ్ఞప్తిని నౌషద్ ఖాన్ అంగీకరించడంతో.. మహీంద్రా థార్ వాహనం నౌషద్ ఖాన్ కు అందింది.

Written By:
  • NARESH
  • , Updated On : March 22, 2024 / 09:48 PM IST

    Anand Mahindra

    Follow us on

    Anand Mahindra : ఇంగ్లాండ్ జట్టుతో ఇటీవల జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ను ఇండియా 4-1 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్ లో రాహుల్, విరాట్ కోహ్లీ, షమీలాంటి దిగ్గజ క్రికెటర్లు లేకపోయినప్పటికీ ఇండియా జట్టను కుర్రాళ్ళు గెలిపించారు. ఆ కుర్రాళ్ళను కెప్టెన్ రోహిత్ శర్మ సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపించాడు. ఈ సిరీస్ లో సర్ఫ రాజ్, ధృవ్ జురెల్ మెరిశారు. దేశవాళి క్రికెట్ లో వీరిద్దరూ అద్భుతంగా రాణించారు. దీంతో టీమిండియా మేనేజ్మెంట్ అనూహ్యంగా సర్ఫ రాజ్, ధృవ్ కు అవకాశం కల్పించింది. వీరులో సర్ఫ రాజ్ కు ఇప్పుడు అవకాశం దక్కాల్సి ఉండేది. కానీ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అతడికి అవకాశం దక్కింది.

    ఇక వచ్చిన అవకాశాన్ని సర్ఫ రాజ్ సద్వినియోగం చేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ లలో వరుస హాఫ్ సెంచరీలు సాధించి అదరగొట్టాడు. ముఖ్యంగా టెస్ట్ జట్టులో అవకాశం లభించిన నేపథ్యంలో.. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నుంచి క్యాప్ అందుకున్నాడు. ఆ సందర్భంలో కన్నీటి పర్యంతమయ్యాడు. తన తండ్రి, భార్యను ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి గురయ్యాడు. సర్ఫ రాజ్ ఖాన్ కెరియర్ కోసం అతని తండ్రి తీవ్రంగా శ్రమించాడని.. తన జీవితాన్ని తన పిల్లల కోసమే ధారపోసాడని అప్పట్లో కారణాలు వినిపించాయి. సర్ఫ రాజ్ తండ్రి నౌషద్ ఖాన్ గురించి కూడా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గొప్పగా చెప్పాడు.

    అయితే ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. నౌషద్ ఖాన్ గొప్పతనాన్ని ప్రశంసించాడు. అతడు ఒప్పుకుంటే మహీంద్రా థార్ ను బహుమతిగా అందిస్తానని ప్రకటించాడు. మహీంద్రా విజ్ఞప్తిని నౌషద్ ఖాన్ అంగీకరించడంతో.. మహీంద్రా థార్ వాహనం నౌషద్ ఖాన్ కు అందింది. ఆ కారు ముందు నౌషద్ ఖాన్, సర్ప రాజ్ ఖాన్, అతడి సోదరుడు ముషీర్ ఖాన్ నిలబడి ఫోటోకు ఫోధించారు. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆనంద్ మహీంద్రా పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.