Pawan Kalyan Janavani : వైసీపీ ప్లీనరీ ఓవైపు.. జగన్ భజన తప్ప ఇంకోటి లేదక్కడ.. కోట్లు ఖర్చు పెట్టి ఈ వైసీపీ ప్లీనరీని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగన్ ఘోషలా ఈ ప్లీనరీ మారింది. ప్లీనరీ అనేది సమీక్ష.. ఆత్మ విమర్శ చేసుకోవాలి.

ఇదే టైంలో జనసేన జనవాణి జనం కోసం.. జనం కొరకు చేశారు. దీంట్లో కోట్లాది రూపాయలు దుబార ఖర్చు చేయడం లేదు. బాధితుల కష్టాలు తీర్చుతున్నారు. అసహాయులకు లక్షలు విరాళం ఇస్తున్నారు. వారి సమస్యలు తీరుస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దగాపడ్డ తొలివర్గం వికలాంగులు. గత ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చేవి. రాయితీ పథకాలు అందించేవి. కానీ వైసీపీ ప్రభుత్వం అన్నింటినీ నవరత్నాలులోనే చూపెడుతోంది. వికలాంగుల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులను పక్కదారి పట్టించింది. గతంలో ఏడాది పొడవునా వికలాంగులకు రుణాలు, త్రిచక్ర వాహనాలు, రాయితీ పథకాలు అందించే వారు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో మాత్రం వికలాంగుల సంక్షేమ శాఖ ఒకటి ఉందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అందుకే జనసేన నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి వికలాంగులు ఎక్కువగా హాజరయ్యారు. చాలామంది వేదిక పైకి వెళ్లలేక కిందే ఉండిపోయారు. వారి ఇబ్బందిని గమనించిన పవన్ కిందకు దిగి మరీ వినతులు స్వీకరించారు. వారి సమస్యలను సావదానంగా విన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా సమస్యలకు పరిష్కారమార్గం చూపిస్తానని హామీ ఇచ్చారు.
ఇలా వైసీపీ ప్లీనరీ హంగామా ఓవైపు.. మరోవైపు ప్రజల కోసం జనసేన జనవాణీ మరోవైపు.. ఈ రెండింటిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
[…] Also Read: Pawan Kalyan Janavani : జనం ఘోష Vs జగన్ ఘోష […]
[…] Also Read: Pawan Kalyan Janavani : జనం ఘోష Vs జగన్ ఘోష […]
[…] Also Read: Pawan Kalyan Janavani : జనం ఘోష Vs జగన్ ఘోష […]
[…] Also Read:Pawan Kalyan Janavani : జనం ఘోష Vs జగన్ ఘోష […]