Pawan Kalyan Janasena Party జనసేన గుండెమీద చేయి వేసుకొని ఆత్మసమీక్ష చేసుకోవాలి. ఇలాగైతే పార్టీ నడిచేటట్టు అయితే ఎప్పటికీ నంబర్ 1 కాలేదు. జనసేన నిజమైన అభిమానుల ఆవేదన ఇదీ. జనసేనను అభిమానించే వారిలో నిరాశ నిసృహలు నెలకొంటున్నాయి. ఆంధ్రాలో మూడో శక్తిగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్న వాళ్లంతా ఇప్పుడు నిరాశ చెందుతున్నారు. భ్రష్టు పట్టిన టీడీపీ, వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని అందరూ కోరుకుంటున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ సేవాతత్పరత.. నిజాయితీ, నిష్కలంక వ్యవహారశైలి అందరికీ గొప్ప నాయకుడిని చేశాయి. అయితే పార్టీని నడిపే విధానం మాత్రం ఇది కాదు అని చెప్పకతప్పదు. ఒక రాజకీయ పార్టీ చేయాల్సిన కార్యక్రమాలను జనసేన చేయడం లేదన్న ఆవేదన జనసేన అభిమానుల్లో నెలకొంది. జనసేన నంబర్ 1 రావడానికి ఇప్పుడు చర్యలు సరిపోవు.
జనసేన పార్టీ అధికారంలోకి రావాలంటే ఎలా వ్యవహరించాలి? ఎలా ముందుకెళ్లాలన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
