Jagan Politics On Pawan Kalyan : పవన్ కళ్యాన్ టార్గెట్ గా ఏపీ సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ, అలీలు ఇందులో భాగమేనని చెప్పొచ్చు. దీని అర్థం ఏంటంటే.. జగన్ వెన్నులో వణుకు మొదలైందని స్పష్టంగా అర్థమవుతోంది. విశాఖలో పవన్ పై నిర్బంధం తర్వాత అతి మరింతగా స్పష్టమైంది.
విశాఖ గర్జన తర్వాత పవన్ కు వచ్చిన క్రేజ్, ప్రజాభిమానం చూశాక జగన్ లో భయం కలిగిందని చెప్పొచ్చు. ఎలాగైనా సరే పవన్ క్రేజ్ ను అడ్డుకోవాలని.. డ్యామేజ్ చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారు. అందుకే పవన్ పై వర్మ, అలీ లాంటి సినీ జనాలను ప్రయోగించడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది.
పవన్ పై కక్ష ఎలా తీర్చుకోవాలో కూడా జగన్ కు తెలియడం లేదు. అందుకే చాలా ఆలోచించి ఇటు వర్మను, అటు అలీకి కీలక పదవి ఇచ్చి ఎగదోసేందుకు రెడీ అయ్యారు. జగన్ కు పవన్ ను చూస్తే నిద్రలేకుండా పోతోందని అర్థమవుతోంది.
పవన్ కు అత్యంత సన్నిహితుడైన అలీకి కేవలం రెండేళ్ల కాలానికి మీడియా సలహాదారు పదవి ఇచ్చాడు. ఇప్పటికే మూడేళ్లు అధికారంలో ఉండగా ఇవ్వని పదవి ఇప్పుడే ఇవ్వడం వెనుక పవన్ పై కక్షసాధింపుతోనే అలీకి ఇచ్చారని అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ కేంద్రంగా జగన్ చేస్తున్న రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.