Pawan vs Jagan: సీఎం జగన్ నిన్న అవనిగడ్డలో తన హోదాను మరిచి చాలా దారుణంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చిన జగన్.. అంతకుముందు మీరు, మీ మంత్రులు మాట్లాడిన మాటల సంగతేంటి? దత్తపుత్రుడు అన్న పదం ఏ విధమైన హుందా ప్రచారమో జగన్ చెప్పాలి. ఆ రోజు 2014లో ఎక్కడా పోటీచేయకుండా పవన్ ను హింసించారు. దత్తపుత్రుడికి పవన్ ఎలా అవుతాడు? ఆ పదం ఏంటి? ముఖ్యమంత్రి హోదాలో ఉండి కుసంస్కారిగా మాట్లాడినందుకు ఏం అనిపించలేదా? అన్నది ప్రశ్న.

‘పీకలేరు’ అంటూ ముఖ్యమంత్రి హోదాలో అనడం ఏం న్యాయం.. ‘… కొడుకులూ’ అని ఒక సీఎం అనడం ఒప్పా? మీరు సీఎంగా ఉండి అలా మాట్లాడడం కరెక్టా? ప్రజలందరికీ ప్రతినిధి అయిన జగన్ ఇలా మాట్లాడడం కరెక్టేనా? మీరు సచ్చీలుడి ఉండి మాట్లాడితే ఇది కరెక్ట్.. ముఖ్యమంత్రి చట్టాలను అమలు చేయాల్సిన జగన్ వైసీపీ నేతలతో చేయించడం ఏం కరెక్ట్ అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.
మీరు, మీ మంత్రులు, నేతలు ఏం మాట్లాడుతున్నారు.. ప్యాకేజీకి అమ్ముడు పోతున్నారని.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనడం ఏం న్యాయం? రెండు మూడు రోజుల కిందట ‘అనిల్ కుమార్’ అనే వ్యక్తి వీడియో చూశాక ముఖ్యమంత్రిగా అలాంటి మాటలను మాట్లాడిన వ్యక్తి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు. జగన్ ఇవన్నీ ప్రోత్సహిస్తూ ఇప్పుడు మొసలికన్నీరు కార్చడం ఎంతవరకూ న్యాయం.. పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ దిగజారుడు ప్రచారంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోను చూడొచ్చు.