Demolition of Houses In Ippatam : ఆంధ్రాలో రౌడీల రాజ్యం.. గుండాల రాజ్యం నడుస్తోంది. ఒకనాడు మమతా బెనర్జీ పాలనలో ఇదే జరిగిందని పుంఖాను పుంఖానుగా కథనాలు వచ్చాయి. బలహీనులు మాట్లాడితే పోలీసులతో వారి నోరు మూయించడం ఎక్కడో విన్నాం.. కానీ ఆంధ్రాలో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం.. నిన్న ఇప్పటం గ్రామం.. మొన్న ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాళ్లదాడి.. అంతకుముందు మరో ప్రతిపక్ష నేతను అర్ధరాత్రి అరెస్ట్.. అసలు ఏపీలో ఏం జరుగుతోందన్నది అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ప్రజాూస్వామ్యం బతికి బట్టకట్టగలదా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా ముందుగానే పసిగట్టాడు. 2019 ఎన్నికలకు ముందే జగన్ ది రౌడీ రాజ్యం అని.. ఫ్యాక్షన్ పాలన వస్తుందని హెచ్చరించారు. జగన్ లాంటి నేరచరిత్ర ఉన్న నేత అధికారంలోకి వస్తే ఏపీ బతికి బట్టగట్టదని అన్నారు. ఇప్పుడు అదే నిజం అవుతోంది.నాడు పవన్ కళ్యాణ్ ను తిట్టిన వారంతా ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి అధికార యాంత్రాంగాన్ని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకొని ఎవరు ఏం మాట్లాడినా బలవంతంగా అణిచివేస్తున్నారు. ప్రతిపక్షమే లేకుండా చేయాలనే కుట్ర.. ఎదురుతిరిగినవాళ్ల మీద కేసులు, అరెస్ట్ లు చేస్తూ.. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన చేస్తున్నారు. భావస్వేచ్ఛను అరికడుతున్నారు. జగన్ పరిపాలన ఫాసిస్ట్ పాలనకు దగ్గరగా ఉందని చెప్పొచ్చు..
ఆంధ్రాలో రాక్షస పాలనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.