AP Volunteer System : వాలంటీర్ల వ్యవస్థపై ఆత్మరక్షణలో పడిన జగన్ ప్రభుత్వం

వాస్తవానికి వలంటీరు ఎక్కువగా డేటా సేకరణలోనే నిమగ్నమవుతున్నారు. ప్రతి రెండు మూడు నెలలకు ఏదో ఒక సర్వే పేరిట ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పింఛన్ల పంపిణీ తరువాత వీరికి పని అంటూ ఏదీ లేదు. ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ నుంచి వచ్చే ఆదేశాలు అమలుచేయడమే వలంటీర్ల ప్రధాన విధి.

Written By: NARESH, Updated On : July 13, 2023 6:07 pm
Follow us on

AP Volunteer System : వలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మొదట్లో దుమారం రేపాయి. వలంటీర్ల రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. అది వైసీపీ రెచ్చగొట్టిందే.. కానీ రోజురోజుకు జనం ఆలోచనలో పడ్డారు. కొంచెం చదువుకున్న వాళ్లు, రాజకీయ అవగాహన ఉన్న వాళ్లు.. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య.

నిన్న తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ మరో సంచలన విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ వలంటీర్ వ్యవస్థ హెడ్ క్వార్టర్ ఆంధ్రలో లేదని.. తెలంగాణ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఉందని.. 700 మంది సిబ్బంది పనిచేస్తున్నారని సంచలన నిజాన్ని బయటపెట్టాడు.

పవన్ వలంటీర్ వ్యవస్థపై సంచలన ఆరోపణలు కొనసాగిస్తున్నారు. వలంటీర్లు సేకరిస్తున్న డేటా హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ఎందుకు దాస్తున్నట్టు అని తాజాగా ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎఫ్.వో.ఏ అంటే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ. దీనికి యజమాని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2020లో ఏజెన్సీని ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్ల నెట్ వర్క్ ను ఈ ఏజెన్సీ కమ్యూనికేట్ చేస్తుంది. అంటే డేటా డిటైలింగ్ బాధ్యత అన్న మాట.

వాస్తవానికి వలంటీరు ఎక్కువగా డేటా సేకరణలోనే నిమగ్నమవుతున్నారు. ప్రతి రెండు మూడు నెలలకు ఏదో ఒక సర్వే పేరిట ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పింఛన్ల పంపిణీ తరువాత వీరికి పని అంటూ ఏదీ లేదు. ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ నుంచి వచ్చే ఆదేశాలు అమలుచేయడమే వలంటీర్ల ప్రధాన విధి. సచివాలయ వ్యవస్థకు అనుసంధానంగా వలంటీర్లు పనిచేస్తున్నా.. అనధికార బాస్ మాత్రం ఆ ఏజెన్సీయే. కానీ ప్రజల వ్యక్తిగత సమాచారం ఆ ఏజెన్సీకి వెళుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

వాలంటీర్ల వ్యవస్థపై ఆత్మరక్షణలో పడిన జగన్ ప్రభుత్వంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.