
Amigos Overseas Review: గత ఏడాది ‘భింబిసారా’ చిత్రం తో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్,’అమిగోస్’ చిత్రం ద్వారా ఈనెల 10 వ తారీఖున మన ముందుకు రాబోతున్నాడు.డిఫరెంట్ కథాంశాలతో సినిమాలు చేసే కళ్యాణ్ రామ్ ఈసారి కూడా మరో కొత్త తరహా కథతో మన ముందుకు వస్తున్నాడు.ఇప్పటి వరకు విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ కూడా కొత్త తరహాలో ఉండడం తో ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది, కానీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.
ఆడియన్స్ అడ్వాన్స్ గా టికెట్స్ తెంచాలంటే కచ్చితంగా మాస్ మసాలా సినిమా అయ్యుండాలి, లేకపోతే మీడియం రేంజ్ హీరో కి ఇలాగే ఉంటుంది,కానీ టాక్ వస్తే మాత్రం మంచి ఓపెనింగ్స్ ఇస్తారు మన ఆడియన్స్, అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో కాసేపటి క్రితమే దుబాయి లో పడింది.
ఈ షో నుండి వినిపిస్తున్న టాక్ ఏమిటో ఒకసారి పరిశీలిస్తే కళ్యాణ్ రామ్ మరోసారి సూపర్ హిట్ కొట్టాడు అనే విషయం అర్థం అవుతుంది..ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని కమర్షియల్ ఫార్మటు లో డైరెక్టర్ రాజేందర్ రెడ్డి చాలా చక్కగా చూపించాడట..ఇక త్రిపాత్రాభినయం లో కళ్యాణ్ రామ్ తన విశ్వరూపం చూపించాడట.కథనం లో ట్విస్టులతో పాటుగా కళ్యాణ్ పాత్రలను డైరెక్టర్ తీర్చిదిద్దిన తీరు పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యిందట.విడుదలకు ముందు నుండే ఈ సినిమా ఒక డిఫరెంట్ జానర్ అని ప్రేక్షకుల్లో ముద్ర వెయ్యడం చాలా మేలు చేసిందనే చెప్పొచ్చు.

ఎందుకంటే ‘భింబిసారా’ వంటి కమర్షియల్ సూపర్ హిట్ తర్వాత ఆడియన్స్ లో కళ్యాణ్ రామ్ సినిమా అంటే అదే స్థాయి అంచనాలు ఉంటాయి, ఆ అంచనాలతో చూస్తే కచ్చితంగా నిరాశ చెందుతారు..అందుకే టీజర్ మరియు ట్రైలర్ తో ఈ సినిమా మీద ఒక క్లారిటీ ఇవ్వడం వల్ల ప్రీమియర్ షో నుండి పాజిటివ్ టాక్ వచ్చింది.ఇక రేపు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.