Ambati Rayudu : వైసీపీ నుంచి ఎందుకు వైదొలిగానో చెప్పిన అంబటి రాయుడు! వైరల్

ప్రొఫెషనల్‌ గేమ్‌ ఆడేందుకు రాజకీయాలు ఆటంకం కాకూడదనే వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు.

Written By: NARESH, Updated On : January 7, 2024 6:36 pm
Follow us on

Ambati Rayudu : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి పట్టుమని పది రోజులు కూడా కాకముందే ఆ పార్టీకి రాజీనామా చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు. ఈ విషయాన్ని ఎక్స్‌ ద్వారా తెలిపాడు. కొంతకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని వెల్లడించాడు. ఇదిలా ఉండగా వైసీపీలో చేరక ముందు నుంచే అధికార పార్టీకి అండగా ఉంటూ వచ్చారు. ఐసీఎల్‌కు రిటైర్మెట్‌ ప్రకటించిన తర్వాత వైసీపీకి చాలా దగ్గరయ్యారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేశారు. జగన్‌ సర్కార్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు మరింత మేలు చేయబోతున్నాయని చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం జగన్‌ను ఆకాశానికెత్తారు. ఈ క్రమంలో గుంటూరు ఎంపీ టికెట్‌ ఆశించి పది రోజుల క్రితం వైసీపీలో చేరారు. అయితే టికెట్‌పై జగన్‌ క్లారిటీ ఇవ్వకపోగా, ఆ టికెట్‌ను మరోకరికి ఖరారు చేశారు. దీంతో పది రోజులకే అనూహ్యంగా ఆయన పార్టీకి రాజీనామా చేశాడు.

రాజీనామాపై చర్చోప చర్చలు..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి పది రోజులు కాకముందే రాయుడు రాజీనామా చేయడంపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరిగింది. రాయుడు తీసుకున్న నిర్ణయం చాలా మందిని షాక్‌కు గురిచేసింది. ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే రాయుడు క్రికెట్‌లో ఉన్నప్పట్నుంచి చూస్తున్నవారు మాత్రం పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే మొదట్నుంచి అంబటి ఇలాంటి నిర్ణయాలే తీసుకునేవాడు. అందుకే ఎక్కువకాలం క్రికెట్‌ల మనుగడ సాగించలేకపోయాడు. అంబటికి టెంపర్‌ ఎక్కువ. ఆవేశం కూడా ఎక్కువే. రాయుడును వైసీపీలో చేర్చుకుని జనసే, టీడీపీని దెబ్బకొట్టాలని జగన్‌ భావించారు. కాపు సామాజికవర్గానికి చెందిన రాయుడుతో వైసీపీకి లాభం కలుగుతుందని లెక్కలు వేశారు. కానీ, తర్వాత వైసీపీ తన నిర్ణయం మార్చుకుంది. గుంటూరు లోక్‌సభ టికెట్‌ అంబటికి ఇవ్వడం లేదని చెప్పేసింది. గంటూరు లోక్‌సభ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న అంబటికి టికెట్‌ నిరాకరించడంతో నొచ్చుకున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలుకు ఇవ్వాలని డిసైడ్‌ అయింది. ఈ కారణంగానే రాయుడు వైసీపీని వీడినట్లు ప్రచారం జరిగింది.

కారణం ఇదేనట..
అయితే రాయుడు రాజీనామాకు కారణంపై ఎవరికి వారు చర్చించుకున్నారు. ఎక్స్‌లో కారణం లేకుండా రాజీనామా ప్రకటన చేయడంతో ఎవరికి నచ్చింది వారు రాసుకున్నారు. ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల తర్వాత మళ్లీ రాయుడే స్పందించాడు. తన రాజీమాకు అసలు కారణం వెల్లడించాడు. ఈనెల 20 నుంచి దుబాయ్‌లో నిర్వహించే ఐఎల్‌టీ20లో ముంబై ఇండియన్స్‌ తరఫున తాను ఆడుతున్నట్లు తెలిపారు. ప్రొఫెషనల్‌ గేమ్‌ ఆడేందుకు రాజకీయాలు ఆటంకం కాకూడదనే వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు.