https://oktelugu.com/

Ambati Rayudu: సామాన్యులపై అంబటి రాయుడి దౌర్జన్యం.. వైరల్ వీడియో

వైసీపీలో చేరే ముందు క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులను తెలుసుకునేందుకు అంబటి రాయుడు ప్రయత్నించినట్లు ఆ మధ్యన వార్త వచ్చింది.

Written By:
  • Dharma
  • , Updated On : December 16, 2023 / 11:37 AM IST

    Ambati Rayudu

    Follow us on

    Ambati Rayudu: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ తో పాటు వైసిపి నేతలను తరచూ కలుస్తూ వస్తున్నారు. గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనను విశాఖ ఎంపీగా పోటీ చేయించాలని హై కామాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే అంబటి రాయుడుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    వైసీపీలో చేరే ముందు క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులను తెలుసుకునేందుకు అంబటి రాయుడు ప్రయత్నించినట్లు ఆ మధ్యన వార్త వచ్చింది. ఒకరిద్దరు సన్నిహితులతో గ్రామీణ ప్రాంతాల్లో తిరిగినట్లు తెలుస్తోంది. అయితే ఓ చోట అంబటి రాయుడు ఓ వ్యక్తి విషయంలో దురుసుగా ప్రవర్తించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వెలుగు చూసింది. కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న ఆయనకు ఓ వ్యక్తి తారసపడ్డాడు. హారన్ కొట్టగా కాస్త చూసి వాహనాన్ని నడపడంటూ సదరు వ్యక్తి అనడంతో.. ఒక్కసారిగా అంబటి రాయుడు ఆయనపై దూసుకు వచ్చాడు. తిట్ల దండకం అందుకొని.. దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్నవారు వారించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే స్థానికులు ఎవరో ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

    గతంలో కూడా అంబటి రాయుడు విషయంలో ఇటువంటి ప్రచారమే జరిగింది. దురుసు ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ వీడియో పాతదేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అంబటి రాయుడు వైసీపీలో చేరనుండడంతో.. పాత వీడియోని టిడిపి సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. ఇక్కడే కాదు క్రికెట్లో సైతం ఇదే తరహా దురుసు ప్రవర్తన వల్ల… రాయుడు నైపుణ్యం వెలుగులోకి రాలేదని.. ఆలస్యంగా టీం ఇండియాలోకి వచ్చాడని.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజకీయాల్లో సహనం, హుందాతనం అవసరమని చెబుతున్నారు. వాటిని అంబటి రాయుడు అలవర్చుకోవాలని సూచిస్తున్నారు.