Homeఆంధ్రప్రదేశ్‌Lakshmi Parvati : అందరూ టార్గెట్ చేసినా.. లక్ష్మీ పార్వతి ఏం సంపాదించింది

Lakshmi Parvati : అందరూ టార్గెట్ చేసినా.. లక్ష్మీ పార్వతి ఏం సంపాదించింది

Lakshmi Parvati : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ఉవ్వెత్తిన ఎగసింది. పార్టీని ఏర్పాటుచేసిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రాగలిగింది. దశాబ్దాల కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించింది. ఢిల్లీ పీఠాని ఎదురెళ్లి ఎన్టీఆర్ పోరాడారు. ఈ పోరాట క్రమంలో ఎన్నోఆటుపోట్లను ఎదుర్కొన్నారు. నాదేండ్ల భాస్కరరావు రూపంలో ఢిల్లీ పెద్దల సాయంతో వెన్నుపోటుకు గురయ్యారు. కానీ ప్రజలసాయంతో మళ్లీ అధికారంలోకి రాగలిగారు. కానీ తరువాత కుటుంబసభ్యులు కొట్టిన దెబ్బ నుంచి మాత్రం తెరుకోలేకపోయారు. మంచం పట్టి ప్రాణాలనే విడిచిపెట్టారు. అయితే ఈ ఎపిసోడ్ కు కారణమంటూ అందరి వేళ్లు చూపించింది మాత్రం లక్ష్మీపార్వతి వైపే. ఆమె నుంచి పార్టీని కాపాడుకునేందుకే పెద్దాయనపై తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని ఇప్పటికీ పశ్చాత్తాప మాటలు వినిపిస్తుంటాయి.

ఆ వయసులో నందమూరి తారక రామారావు పెళ్లి చేసుకోవడం కుటుంబసభ్యులకు కాస్తా అభ్యంతరకరమే. అప్పటికే ఆయన వయసు ఏడు పదులు దాటుతోంది. అంత పెద్ద కుటుంబం ఉండగా.. పెళ్లి చేసుకోవాల్సినంత అవశ్యం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికితోడు పార్టీని పెద్దావిడ హైజాక్ చేస్తుందన్న మాట తెరపైకి వచ్చింది. అటు కుటుంబసభ్యుల అసంతృప్తి, పార్టీ నేతల్లోవెల్లువెత్తిన అభద్రతాభావం చంద్రబాబుకు కలిసి వచ్చింది. అందరి సహకారంతో సీఎం పదవిని, పార్టీని పద్ధతి ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ అపవాదును మాత్రం లక్ష్మీపార్వతిపై వేశారు. ఇప్పటికీ దానినే కొనసాగిస్తున్నారు.

ఇప్పటికీ ఒక స్లోగన్ వినిపించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. 1995 సంక్షోభం రాకుంటే..ఎన్టీఆర్ చేతిలోనే తెలుగుదేశం పార్టీ మునిగిపోయేదన్నదే దాని సారాంశం. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ పార్టీని నడిపించడంలో ఫెయిలయ్యి ఉండేవారన్న వాదనను బలంగా తీసుకెళ్లగలిగారు. వాస్తవానికి లక్ష్మీపార్వతిని ఒక పద్ధతి ప్రకారం డీ గ్రేడ్ చేయించారు. ప్రధానంగా పార్టీలో ఉంటూ ఒకరిద్దరికి టిక్కెట్లు ఇప్పించుకోవడం సహజం. అప్పుడు లక్ష్మీపార్వతి అదే చేశారు. దానికి అందరూ టార్గెట్ చేశారు. అదే తప్పు అయితే టీడీపీలో సుజనా చౌదరి టిక్కెట్లు ఇప్పించుకోలేదా? సీఎం రమేష్ ఇప్పించుకోలేదా? అంతెందుకు జూనియర్ ఎన్టీఆర్ సిఫారసులకు సైతం పెద్దపీట వేసి టిక్కెట్లు ఇస్తే రివర్స్ అవుతారా? అని కొడాలి నాని,  వల్లభనేని వంశీలకు ఇప్పటికీ టీడీపీ నాయకులు తిడుతుంటారు. అటువంటిది లక్ష్మీపార్వతి చిన్నపాటి సిఫారసు చేస్తే దానినే బూతద్ధంలో చూపించారు. టీడీపీలో సంక్షోభానికి ఆమె కారణమని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ చెప్పుకొస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version