Akkineni Nageswara Rao: సమాజంలో ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు కూడా హార్ట్ ఎటాక్ లు వచ్చి చనిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మన జీవన శైలి లో వచ్చిన తేడాలే దానికి కారణం అంటూ డాక్టర్లు చెప్తున్నారు. నిజానికి హార్ట్ ఎటాక్ అనేది గుండె వీక్ గా ఉన్న వారికి ఎక్కువగా వస్తుందంటూ డాక్టర్లు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటే టాలీవుడ్ కి చెందిన ఒక సీనియర్ హీరో కి ఇలానే హార్ట్ ఎటాక్ తో ఎక్కువ ఇబ్బంది పడుతుండటంతో వల్ల ఆయన గుండె మార్పిడి చేసుకుని చాలా సంవత్సరాల పాటు హాయిగా జీవించారనే విషయం మనలో చాలామందికి తెలియదు. గుండె ట్రాన్స్ఫర్ చేస్తే మనిషి బతుకుతారా అనే విషయంలో కూడా చాలా మందికి చాలా అనుమానులు ఉన్నాయి. అయితే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన బడి లోని ఆర్గాన్స్ కొద్దిసేపటి వరకు ప్రాణాలతోనే ఉంటాయి.
కాబట్టి వాటిని సకాలంలో ఎవరికైతే కావాలో వాళ్ళకి సర్జరీ చేసి ట్రాన్స్ ఫర్ చేసినట్లయితే వాళ్లు బతుకుతారు. ఇక ఇలాంటి క్రమంలోనే సీనియర్ హీరో అయిన అక్కినేని నాగేశ్వరరావు కూడా గుండె మార్పిడి చేసుకొని చాలా సంవత్సరాల పాటు హాయిగా జీవించారు. అయితే ఈ సర్జరీ చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఇలా చేసేటపుడు కొంచెం ప్రాబ్లం అయిన కూడా మనిషి ప్రాణానికే ప్రమాదం కానీ నాగేశ్వరరావు అలాంటివేమి పట్టించుకోకుండా తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి గుండె మార్పిడి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.
ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల తరచూ ఇబ్బందులు వస్తూ ఉండేవి అందువల్లే డాక్టర్ల సలహా మేరకు గుండె మార్పిడి చేయించుకున్నాడు. ఆయన ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో ఆయన 90 సంవత్సరాలకు పైన సంతోషంగా జీవించారు. అయితే అక్కినేని కుటుంబం అంతా కలిసి చేసిన మనం సినిమాలో ఆయన ఒక పాత్రను పోషించి వాళ్ల ఫ్యామిలీ సినిమాగా గుర్తుండిపోయే ఈ సినిమాలో నటించి తన తుది శ్వాస విడిచారు.
అయితే మనం సినిమా డబ్బింగ్ ని ఆయన హాస్పిటల్ బెడ్ మీది నుంచే చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆయన అందరిని విడిచి అనంతలోకాలకు వెళ్లిపోవడం అక్కినేని ఫ్యామిలీతో పాటు ప్రేక్షకలోకాన్ని సైతం కదిలించి వేసింది…