Naa Saami Ranga Review: నా సామి రంగ మూవీ ఫుల్ రివ్యూ…

నాగార్జున నా సామి రంగ అనే సినిమాతో ఈరోజు థియేటర్లోకి వచ్చాడు. మరి ఈ సినిమా తో నాగార్జున హిట్ కొట్టాడా..? ఇక ఈ సంక్రాంతికి మరోసారి నాగార్జున సక్సెస్ ఫుల్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడా.? లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ లో తెలుసుకుందాం.

Written By: Gopi, Updated On : January 14, 2024 9:38 am

Naa Saami Ranga Review

Follow us on

Naa Saami Ranga Review: నాగార్జున నుంచి సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం సినిమా గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలో పండుగకి నాగార్జున సినిమా వచ్చిందంటే ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఇక ఈ సంక్రాంతికి కూడా నాగార్జున నా సామి రంగ అనే సినిమాతో ఈరోజు థియేటర్లోకి వచ్చాడు. మరి ఈ సినిమా తో నాగార్జున హిట్ కొట్టాడా..? ఇక ఈ సంక్రాంతికి మరోసారి నాగార్జున సక్సెస్ ఫుల్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడా.? లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ లో తెలుసుకుందాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముగ్గురు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. అయితే ఒకరోజు స్కూల్లో జరిగిన ఒక చిన్న గొడవ వల్ల నాగార్జున స్కూల్ మానేయాల్సి వస్తుంది. దాంతో అప్పటినుంచి పని పాట లేకుండా అలాగే ఎలాంటి బాధ్యత లేకుండా నాగార్జున తిరుగుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోతాడు దానికి కారణం నాగార్జున అని అపోహ పడిన హీరోయిన్ తనతో మాట్లాడదు. ఇక ఇదే క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది నడుస్తూ ఉంటుంది కానీ ఒకరికొకరు మాత్రం చాలా సంవత్సరాల పాటు చెప్పుకోకుండా ప్రేమించుకుంటూ ఉంటారు.మరి వీళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా నాగార్జునని దెబ్బతీయాలని చూస్తున్న ఊర్లో వాళ్ల మీద నాగార్జున ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది ఈ సినిమా ఫుల్ స్టోరీ…

విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ విజయ్ బిన్నీ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడ కూడా డివిషన్స్ లేకుండా కథని చాలా స్ట్రైయిట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక ఫ్రెండ్స్ గా ఉన్న అల్లరి నరేష్, నాగార్జున, రాజ్ తరుణ్ ల మధ్య వచ్చే ఫ్రెండ్షిప్ సీన్స్ ని నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కించాడు. ఇక ఫస్ట్ ఆఫ్ అంత సరదా సరదాగా సాగిన ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్o మాత్రం ఒక ఊహించని ట్విస్ట్ తో ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ని ఎత్తుకోవడమే నార్మల్ వేలో ఎత్తుకొని సినిమాని స్లో గా ముందుకు తీసుకెళ్ళాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కొన్ని ఊహించని ఎమోషన్ సీన్స్ మనల్ని సినిమాకి కట్టిపడేస్తాయి అని చెప్పడంలో ఎంత మాత్రం శక్తి లేదు. చివరి 20 నిమిషాలు అయితే యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశాడు. ఇక నాగార్జున ఇంతకుముందు సంక్రాంతి కి సోగ్గాడే చిన్నినాయన సినిమాతో వచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నాడు. సేమ్ అదే తరహాలో ఈ సినిమా కూడా ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా మొత్తాన్ని బాగానే హ్యాండిల్ చేసిన దర్శకుడు కోర్ ఎమోషన్ సీన్స్ లో మాత్రం తడబడ్డాడు ఎక్స్పీరియన్స్ లేని ఆయన డైరెక్షన్ కొన్ని సీన్లలో చాలా స్పష్టంగా కనిపించింది… ఇక కీరవాణి మాత్రం కొన్ని సీన్లని ఎలివేట్ చేయడానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగా ఇచ్చాడు. సాంగ్స్ పరంగా అంత పెద్ద మ్యూజిక్ ఇవ్వలేదు అనిపించినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది…

నటీనటుల పర్ఫామెన్స్
ముఖ్యంగా నాగార్జున నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన ఎలాంటి పాత్రలను అయిన చాలా ఈజీగా చేస్తాడు. ఇక ఇలాంటి ఒక ఎంజాయ్ ఫుల్ స్టోరీలో చేయాలంటే నాగార్జున తర్వాతే ఎవరైనా అని ఆయన ఇంతకుముందు ఎన్నోసార్లు ప్రూవ్ చేశాడు. ఇప్పుడు కూడా అదే రీతిలో నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ని అయితే ఇచ్చాడు. ఇక అల్లరి నరేష్ చాలా ఎమోషనల్ గా ఉండే సీన్లలో చాలా అద్భుతమైనటువంటి నటన ని కనబరిచాడు. ఒక కొత్త అల్లరి నరేష్ ని ఈ సినిమాలో మనకు చూపించాడు. అలాగే రాజ్ తరుణ్ కి కూడా సరైన సక్సెస్ లేకపోయినప్పటికీ తన నటనలో మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాలో మంచి నటనని కనబరిచి తన కంటూ ఉన్న పేరు కాపాడుకుంటూ వచ్చాడు ఇంకా హీరోయిన్ గా చేసిన ఆశిక రంగనాథ్ కూడా తన పర్ఫామెన్స్ కూడా ఈ సినిమాకి బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి. కొన్ని సీన్స్ లలో తనించిన ఎక్స్ప్రెషన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి… మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు అందరూ కూడా వాళ్ల పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు…

టెక్నికల్ విషయాలు…

ఇక ఈ సినిమాకి టెక్నికల్ అంశాల విషయానికి వస్తే కీరవాణి అందించిన మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోనప్పటికీ తను ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. అలాగే సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ కూడా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉండడంతో ఈ సినిమాకి గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. ముఖ్యంగా సినిమా టీమ్ అంతా కలిసి 1980-90 నాటి రోజులను రిపీట్ చేయడంలో చాలావరకు సక్సెస్ అయ్యారు అలాగే సీన్లలో ఆ మ్యాజిక్ ని సక్సెస్ ఫుల్ గా పోట్రే చేయగలిగారు…

ప్లస్ పాయింట్స్

ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే

నాగార్జున నటన
కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
కథ

ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే

మైనస్ పాయింట్స్

కొన్ని సీన్లల్లో డైరెక్షన్ బాలేదు
కొన్ని సీన్లు వేరే సినిమాల్లో ఇంతకు ముందే చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.

రేటింగ్
ఇక సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.75/5

చివరి లైన్ : సోగ్గాడి పాత్ర లో మరోసారి మెప్పించిన నాగ్…