https://oktelugu.com/

Brahmanandam Son Marriage: బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి సందడి… ఎవరెవరు వచ్చారో తెలుసా?

స్టార్ కమెడియన్ గా బ్రహ్మానందం మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. వేల చిత్రాల్లో వివిధ పాత్రలు చేశారు. ఆ మధ్య అనారోగ్యానికి గురైన బ్రహ్మానందం సినిమాలు తగ్గించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 19, 2023 / 09:10 AM IST

    Brahmanandam Son Marriage

    Follow us on

    Brahmanandam Son Marriage: స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ కి చెందిన డాక్టర్ పద్మజ, విజయ్ ల కుమార్తె ఐశ్వర్యతో సిద్ధార్థ్ ఏడడుగులు వేశారు. నగరంలో గల అన్వయ్ కన్వెన్షన్ హాల్ ఇందుకు వేదికైంది. బ్రహ్మానందం కుమారుడు పెళ్ళికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్ చరణ్, మోహన్ బాబుతో పాటు పలువురు సినీ పెద్దలు పెళ్లికి విచ్చేశారు.

    అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణా సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బ్రహ్మానందంకి ఇద్దరు కుమారులు కాగా పెద్దబ్బాయి రాజా గౌతమ్. పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజా గౌతమ్ పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం వ్యాపారాలు చూసుకుంటూనే అడపాదడపా చిత్రాల్లో నటిస్తున్నాడు.

    Brahmanandam Son Marriage

    ఇక చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. అతడు చిత్ర పరిశ్రమకు రాలేదు. సిద్ధార్థ్ గురించి పబ్లిక్ కి తెలిసింది తక్కువే. రాజా గౌతమ్ కి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. రెండో కొడుకు సిద్ధార్థ్ కి కూడా పెళ్లి చేసి బ్రహ్మానందం తన బాధ్యతలు పూర్తి చేసుకున్నాడు.

    Brahmanandam Son Marriage

    స్టార్ కమెడియన్ గా బ్రహ్మానందం మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. వేల చిత్రాల్లో వివిధ పాత్రలు చేశారు. ఆ మధ్య అనారోగ్యానికి గురైన బ్రహ్మానందం సినిమాలు తగ్గించారు. ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. జాతిరత్నాలు, పంచతంత్రం, రంగమార్తాండ, బ్రో చిత్రాల్లో బ్రహ్మానందం నటించారు.

    Brahmanandam Son Marriage

     

    Brahmanandam Son Marriage

     

    Brahmanandam Son Marriage

    Brahmanandam Son Marriage

    Brahmanandam Son Marriage

    Brahmanandam Son Marriage