Acharya – Siddha’s Saga Teaser : టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి.. ఆయన తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న వారసుడు రాంచరణ్ కలిసి నటించిన మూవీ ‘ఆచార్య’. ఈ తండ్రీకొడుకులను అంతే అద్భుతంగా తెరకెక్కించి తీశాడు టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కొరటాల శివ. ఈచిత్రంలో ఆచార్యగా చిరంజీవి, సిద్ధగా నక్సలైట్ గా మారిన పాత్రలో రాంచరణ్ నటించారు. తాజాగా ‘సిద్ధ’ టీజర్ ను విడుదల చేశారు.

పవర్ ఫుల్ పాత్రలో అన్యాయాలను ఎదురించి మావోయిస్టుగా మారిన రాంచరణ్ గెటప్, నటన ఆకట్టుకునేలా ఉంది. ‘ధర్మస్థలికి ఆపదొస్తే అది జయించడానికి అమ్మోరుతల్లి మాలో ఆవహించి ముందుకు పంపుతుంది’ అంటూ రాంచరణ్ డైలాగ్స్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఇక చివరి సీన్ హైలెట్ గా నిలిచింది. నక్సలైట్లుగా మారిన రాంచరణ్, చిరంజీవి ఒక పారుతున్న సెలయేరులో ఇటువైపు నీళ్లు తాగుంతుంటే మరోవైపు చిరుత పులి, దాని పిల్ల మరోవైపు నీళ్లు తాగుతున్న సీన్ గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది.
దేవాదాయశాఖలోని అవినీతిని ఎదురించే పాత్రలో చిరంజీవి, సహకరించే కీలక నక్సలైట్ గా రాంచరణ్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న సినిమాను విడుదల చేయనున్నారు.