KTR Accident : ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రికి అపశ్రుతులు ఎదురవుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రచారానికి వెళ్తున‍్న హెలిక్యాప్టర్ మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు మొరాయించింది. అయితే ఎలాంటి ప్రమాదం జరుగలేదు. తాజాగా ఆయన తనయుడు, తెలంగాణ ముఖ్యమైన మంత్రిగా గుర్తింపు ఉన్న కేటీఆర్‌కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆర్మూర్ ప్రచారానికి వెళ్లిన ఆయన ప్రచార రథంపై నుంచి కిందపడ్డాడు. అయితే ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మొన్న కేసీఆర్‌కు..
వారం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు వెళ్లేందుకు గజ్వేల్‌లోని తర ఫాం హౌస్ నుంచి చాపర్‌లో బయల్దేరారు. చాపర్ టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని గుర్తించిన పైలెట్ వెంటనే చాపర్‌ను ఫాంహౌస్‌లో సేఫ్‌గా ల్యాండింగ్ చేశారు. తర్వాత మరో చాపర్‌లో ఆయన ప్రచారానికి వెళ్లారు. రెండు రోజుల క్రితం ఆసిఫాబాద్ పర్యటనకు వెళ్లారు. అక్కడ కూడా హెలిక్యాప్టర్ మోరాయించింది. పైకి ఎగరకపోవడంతో సీఎం రోడ్డు మార్గంలో సిర్పూర్ పర్యటనకు వెళ్లారు.
ఆర్మూర్‌లో కేటీఆర్‌కు..
ఆర్మూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడి‍్డ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేటీఆర్ గురువారం ఆర్మూర్ వెళ్లారు. జీవన్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, కేటీఆర్ ప్రచారరథంపై నామినేషన్‌కు బయల్దేరారు. ఒక్కసారిగా రథం రెయిలింగ్ విరిగిపోయింది. దీంతో ముగ్గురితోపాటు పైన ఉన్నవారు కిందపడబోయారు. అయితే అప్రమత్తమైన గన్‌మెన్‌లు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ముగ్గురికీ స్వల్ప గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం జీవన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం సజావుగానే పూర్తి అయింది. ఓపెన్ టాప్ జీపు కావడంతో ఒక్కసారిగా అందరూ రెయిలింగ్ ను పట్టుకోవడంతో బరువు ఆపలేక అది విరిగిపోయిందని చెబుతున్నారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అదృష్టవశాత్తు తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందవద్దని కోరారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం కేటీఆర్.. కొడంగల్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ ప్రచారం రథంపై నుంచి కిందపడిపోయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
KTR fell off from election campaign vehicle during rally in Armoor. Suresh Reddy and Jeevan Reddy were in vehicle. Alert gunman came to rescue pic.twitter.com/1r8lnlEvgq
— Naveena (@TheNaveena) November 9, 2023