https://oktelugu.com/

ETV Dhee – Pradeep : ఢీ నుంచి ప్రదీప్ ఔట్.. సెలబ్రిటీ సీజన్ లో మార్పులు.. ఈటీవి ని నిలబెడతాయా?

ప్రో కబడ్డీ, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లలో తెలుగు యాంకర్ గా పనిచేసిన అనుభవం ఉంది. మరి ఈ కూడికల, తీసివేతల కలయిక ఈటీవీకి పునర్ వైభవం తెస్తుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : January 1, 2024 / 05:41 PM IST
    Follow us on

    ETV Dhee – Pradeep : ఒకప్పుడు ఈటీవీ ఎంటర్టైన్మెంట్ విభాగంలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది.. జెమిని వచ్చిన తర్వాత ఢీ అంటే ఢీ అనే స్థాయిలో దానితో పోటీపడేది. అంతరంగాలు, ఇది కథ కాదు, శాంతినివాసం, విధి, అన్వేషిత వంటి సీరియల్స్ తో తిరుగులేని స్థానంలో కొనసాగింది.. కొంతకాలానికి జెమిని టీవీకి ఆస్థానాన్ని అప్పగించింది. మా టీవీ వచ్చిన తర్వాత మూడవ స్థానంలోకి వెళ్లిపోయింది.. జీ తెలుగు వచ్చిన తర్వాత 4, 3 స్థానాల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు తనకు బలమైన సీరియల్స్ ను అత్యంత నాసిరకంగా నిర్మిస్తోంది. సో వాటికి వచ్చే రేటింగ్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇవాల్టికి ఈటీవీని నిలబెడుతున్నవి ఆ ఢీ, జబర్దస్త్ మాత్రమే.. ఇక ప్రైమ్ టైంలో టెలికాస్ట్ అయ్యే ఈటీవీ న్యూస్ కూడా బెటర్ రేటింగ్స్ నే నమోదు చేస్తూ ఉంటుంది.

    బంగారు బాతు గుడ్డు లాంటి ఢీ, జబర్దస్త్ లాంటి షోలను కాపాడుకోవాల్సిన ఈటీవీ ఎప్పుడో చేతులెత్తేసింది. గతంలో తనకి కాసులు కురిపించిన ఆ రియాల్టీ షోల విషయంలో అటు మల్లెమాల టీం కూడా పట్టించుకోనట్టు కనిపిస్తోంది. నితిన్_ భరత్ ఉన్నప్పుడు జబర్దస్త్ షో చాలా బాగుండేది. వారిద్దరు బయటికి వెళ్లిన తర్వాత అది బీ గ్రేడ్ షో అయిపోయింది. చాలామంది జడ్జ్ లు మారిపోయిన తర్వాత
    కృష్ణ భగవాన్, ఇంద్రజ లాంగ్ స్టాండింగ్ గా కొనసాగుతున్నారు. అయితే ఈ షో కూడా పూర్ రేటింగ్స్ నమోదు చేస్తోంది. రోజురోజుకు ఈ షోలో వచ్చే స్కిట్ లు అత్యంత నాసిరకంగా ఉంటున్నాయి.. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా జబర్దస్త్-2 లాగా ఉంటున్నది తప్ప.. పెద్దగా దాన్లో కూడా నవ్యత లేదు. అయితే తాజాగా ఢీ సీజన్ పూర్తయింది. కొత్త సీజన్ ను సెలబ్రిటీల పేరుతో ప్రారంభించారు. ఇలాంటి ప్రయోగాన్ని అటు మాటీవీ, జీ తెలుగు సాగించాయి కూడా. అయితే ఇవి రెండు కూడా అంత గొప్పగా రేటింగ్స్ సాధించలేదు.

    ఢీ అనగానే గత కొంతకాలం నుంచి తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రదీపే మెదులుతాడు. అతడి స్పాంటేనిటి ఆ షో కు పెద్ద బలం. అయితే తాజా సీజన్ కు సంబంధించి ప్రదీప్ స్థానంలో యాక్టర్ నందు వచ్చాడు. సుమ కూడా ఎలాగూ ఆస్థాన యాంకర్ కాబట్టి ఆమె కూడా దర్శనమిచ్చింది. తన కొడుకు బబుల్ గమ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ సినిమా హీరో రోషన్, హీరోయిన్ మానస చౌదరిని వెంటపెట్టుకుని వచ్చింది. హైపర్ ఆది ఏదో నవ్వించడానికి ప్రయత్నించాడు కానీ. అవి అంతగా క్లిక్ కాలేదు. ఇక జడ్జిగా ఎవరో తమిళ డాన్స్ మాస్టర్ ను, అత్తారింటికి దారేదిలో నటించిన ప్రణితను తీసుకొచ్చారు. బుల్లితెరలో బాగా ప్రాచుర్యం పొందిన వారిని కంటిస్టెంట్లుగా తీసుకొచ్చారు..ఆ కుప్పి గంతులు.. ఆ బీ గ్రేడ్ జోకులు కామనే కానీ… ఇన్నాళ్లు ఆస్థాన యాంకర్ గా పనిచేస్తున్న ప్రదీప్ ను వదిలించుకోవడమే ఒకింత ఆశ్చర్యం అనిపించింది. అయితే ఆయన స్థానంలో నందును ఎందుకు తీసుకున్నారనేదే ఇక్కడ ప్రశ్న. అతడికి కూడా ప్రో కబడ్డీ, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లలో తెలుగు యాంకర్ గా పనిచేసిన అనుభవం ఉంది. మరి ఈ కూడికల, తీసివేతల కలయిక ఈటీవీకి పునర్ వైభవం తెస్తుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.