https://oktelugu.com/

ABN RK: ఆర్కే శోకాలు : నాడు చంద్రబాబు చేశాడు.. నేడు జగన్ చేస్తున్నాడంతే!

చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి రాధాకృష్ణ శోకాలు పెడుతూనే ఉన్నాడు. తన ఛానల్, పేపర్లో డిబేట్లు, పేజీల కొద్దీ వార్తలు ప్రచురిస్తూనే ఉన్నాడు. ఆదివారం తాజాగా "పాలెగాడి కుతంత్రం" అనే శీర్షికతో తనదైన స్టైల్ లో రాసుకొచ్చాడు.

Written By: , Updated On : September 24, 2023 / 09:23 AM IST
ABN RK

ABN RK

Follow us on

ABN RK: చంద్రబాబు అరెస్టు తర్వాత.. పచ్చ మీడియా ఆయనకు అనుకూలంగా రాస్తున్న వార్తల్లో శృతి మించుతున్నది. ఏం రాస్తున్నామో సోయి లేకుండా అడ్డగోలుగా రాసేస్తోంది. “దోమలతో చంద్రబాబును చంపేస్తున్నారని, చంద్రబాబు స్నానం చేయడానికి వేడి నీళ్లు కూడా లేవని, ఆయన హాయిగా కునుకు తీసేందుకు కనీస ఏర్పాట్లు లేవని, చంద్రబాబును చూసేందుకు కరుడుగట్టిన ఖైదీలు బారులు తీరారని”(ఇలాంటివి చాలానే ఉన్నాయి. కుప్పలు తెప్పలుగా..) ఇలా రాసుకొచ్చింది. అయితే ఈ పచ్చ మీడియాలో ఆంధ్రజ్యోతి ది కొత్త శైలి. డప్పు కొట్టడంలో ఈనాడు కొంత పద్ధతిని పాటిస్తుంది. కానీ ఆంధ్రజ్యోతి అలా కాదు. ఏకంగా నడి బజార్లో నర్తిస్తూ ఉంటుంది. ఇంకా దాని ఓనర్ వేమూరి రాధాకృష్ణ ప్రతి ఆదివారం కొత్త పలుకు పేరిట రాసే వ్యాసాలు మరో విధంగా ఉంటాయి.

చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి రాధాకృష్ణ శోకాలు పెడుతూనే ఉన్నాడు. తన ఛానల్, పేపర్లో డిబేట్లు, పేజీల కొద్దీ వార్తలు ప్రచురిస్తూనే ఉన్నాడు. ఆదివారం తాజాగా “పాలెగాడి కుతంత్రం” అనే శీర్షికతో తనదైన స్టైల్ లో రాసుకొచ్చాడు. “ఇంతకాలంగా చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ వచ్చిన జగన్ అండ్ కో ఇప్పుడు తాను మాత్రం అదే పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఫలితంగానే కాబోలు చంద్రబాబుకు న్యాయస్థానాల్లో లభించడం లేదన్నది జనాల్లో విస్తృతాభిప్రాయంగా ఉంది. చంద్రబాబును రిమాండ్ కు పంపడం దగ్గర నుంచి క్వాష్ పిటిషన్ కొట్టివేయడం వరకు జరిగిన తంతు అనేక ప్రశ్నలను మన ముందు ఉంచుతోంది. న్యాయస్థానాల ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయో కూడా వైసిపి సోషల్ మీడియాలో ముందుగానే చెప్పేస్తున్నారు” ఇవీ రాధాకృష్ణ కొత్త పలుకులో రాసిన వ్యాఖ్యాలు. అంటే చంద్రబాబు ఒకప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేశాడని, దానికి మేమందరం సాక్షి భూతులమేనని రాధాకృష్ణ ఒప్పుకున్నట్టే కదా. “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని చేసినప్పుడు జరిగిన పలు కుంభకోణాల్లో తను ముందుగానే అరెస్టు కాకుండా ఉండేందుకు చంద్రబాబు బెయిల్స్ తీసుకునేవాడు. అంటే జయప్రదంగా తనను తాను నిప్పు అని నిరూపించుకున్నాడు.” అనే ఆరోపణలను రాధాకృష్ణ రాసిన వ్యాఖ్యలు నిజం చేస్తున్నాయి..

గతంలో జగన్ కేసులో ఇంప్లీడ్ అయినప్పుడు, అతడికి 16 నెలల పాటు జైలు శిక్ష పడినప్పుడు ఇదే టిడిపి సోషల్ మీడియా (అప్పుడు ఇంత బలంగా లేదు), మీడియా ఎలాంటి వార్తలు రాసాయో తెలియదా. ఇదే రాధాకృష్ణ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ మీద ఎలాంటి కథనాలు ప్రచురించాడో తెలుగు పాఠకులకు గుర్తుకు లేదా.. మరినాడు పచ్చ మీడియా ఆ స్థాయిలో రాసింది అంటే దానికి కారణం న్యాయస్థానాలేనా? నాడు వాళ్లు చేసింది కరెక్ట్ అయితే.. ఇప్పుడు జగన్ చేస్తోంది కూడా కరెక్టే కదా.. ఇంతోటి దానికి ఈ శోకాలు ఎందుకు రాధాకృష్ణ? ఈ పేజీలకు పేజీలు వార్తలు రాయడం దేనికి? పాలెగాడి కుతంత్రం అని రాసేముందు.. నాడు ప్రతిపక్షంలో ఉన్న ఒకప్పటి పాలెగాడు ఎలాంటి కుయుక్తులు పన్నాడో.. ఇ
ఎలాంటి కేసుల్లో ఇంప్లిడ్ అయ్యాడో.. నేడు జగన్ కూడా అదే చేస్తున్నాడు. తమలపాకుతో ఒకటి ఇస్తే.. తలుపు చెక్కతో మరొకటి ఇస్తున్నాడు. తప్పేముంది.. ఒకప్పటి తమిళనాడు రాజకీయాల్లో చూస్తున్న వాతావరణం ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నది. మొత్తానికి ప్రతిపక్ష నాయకుడు, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి..ఇద్దరూ జైలుకు వెళ్లి వచ్చిన వారే అనే నానుడి స్థిరపడిపోయింది. “అన్నట్టు, తన ప్రత్యర్థులు ఎవరో ఎక్కడ దాచుకోకుండా జగన్మోహన్ రెడ్డి చెబుతూనే ఉన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటు రామోజీరావును, నన్నూ ప్రత్యర్థులుగా ఆయన ప్రకటించుకున్నారు.” అని రాధాకృష్ణ రాశాడు. అంటే త్వరలో రాధాకృష్ణను కూడా జగన్ చేయబోతున్నాడా?!