
Pawan Kalyan vs ABN RK : “యదార్థవాది లోక విరోధి” పాపం… సువిశాల తెలుగు జర్నలిజంలో నా అంత సచ్చీలుడు, సర్వ పరిత్యాగుడు ఎవరూ లేరు తెలుసా? నేను ఉన్నది ఉన్నట్టు చెబుతాను. కానీ ఈ పాడు లోకం నన్ను అర్థం చేసుకోదు” ఇలా సాగిపోయింది ఆర్కే ఈవారం కొత్త పలుకు.. గతవారం తన కొత్త పలుకులో జనసేనాని పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ 1000 కోట్ల ఆఫర్ ఇచ్చాడని, మధ్యవర్తులుగా ఆంధ్రప్రదేశ్ కాపు నేతల్ని రంగంలోకి దింపాడని బొంబాట్ గా రాసుకొచ్చాడు. అంతేకాదు పవన్ కేసీఆర్ ఫోల్డ్ లోకి వెళ్ళిపోతున్నాడని, ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ నాయకులు ఇక ఆలోచించుకోవాలని ఇన్ డైరెక్ట్ గా హెచ్చరించాడు.. ఇది సహజంగానే ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. “తన వెయ్యి కోట్ల వ్యాసం” తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి లాభం కలగాలని మరీ రాధాకృష్ణ తెగ బట్టలు చింపుకొని మరీ రాశాడు. కానీ ఆర్కే ఒకటి తలిస్తే, ఏపీ జనం మరొకటి తలచారు. సీన్ బెడిసి కొడుతున్న నేపథ్యంలో చంద్రబాబు దీనిపై ఆర్కే కు బాగా తలంటాడని ఇన్ సైడ్ టాక్.. అందులో భాగమే ఇవాళ్టి ప్రాయశ్చిత్త ‘పలుకు’.
-వైసీపీ వాడుకుంది
వాస్తవంగా ఆర్కే ఏదయినా రాస్తే దాన్ని టిడిపి ప్రచారం చేసుకుంటుంది.. జగన్ మీద కారాలు మిరియాలు నూరుతాడు కాబట్టి.. “చూశావా జగన్ నీకు కనీసం పాలించడం కూడా రాదు” అంటూ ఎగతాళి చేస్తాడు.. నాడు వైయస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి ఇప్పటి దాకా ఆర్కే ఇలానే రాస్తున్నాడు. తన పసుపు వీర విధేయతను ప్రదర్శిస్తూనే ఉన్నాడు. తెరవెనక టీడీపీకి ఉపయోగపడుతున్నాడు.. ఇందుకు తగ్గట్టుగానే మేళ్ళని పొందాడు అంటారు.
-సీన్ రివర్స్
ఎప్పుడయితే కేసీఆర్ పవన్ కి వెయ్యి కోట్లు ఆఫర్ ప్రకటించాడు అని రాశాడో అప్పుడే వైసీపీ అలర్ట్ అయింది..రోగి కోరింది పెరుగు అన్నమే, డాక్టర్ తినమని చెప్పిందీ పెరుగన్నమే అన్నట్టుగా వైసీపీ కోరుకున్నట్టుగానే ఆర్కే తన పత్రికలో పవన్ కు వ్యతిరేకంగా రాయడంతో వైఎస్ఆర్సిపి జబ్బలు చరుచుకుంది. ఆ కథనాన్ని తన సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయించింది. దీంతో దెబ్బకు జనసేన నాయకులు అలర్ట్ అయ్యారు..ఆర్కే మీద అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. అంతే కాదు ఏపీలో ఆ పత్రికను తగలబెట్టారు.. ఈ విషయం బాబుకు తెలియడంతో ఆర్కే మీద ఫైర్ అయ్యాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ” నీకు నీ వార్తలకు ఓ దండం. ముందు ఆ రోత రాతలు మానుకోవయ్యా” అంటూ హెచ్చరికలు పంపారని అంటున్నారు.. ఇక పవన్ నుంచి ఘాటు మాటలు రావడంతో ఆర్కేకు ఏం చేయాలో పాలు పోలేదు.. ఫలితంగా ‘క్షమించండి’ అని వేడుకున్నాడు.
-నాడు రాయలేదేం?
హరికృష్ణ చనిపోయినప్పుడు అక్కడికి వచ్చిన కేటీఆర్ తో చంద్రబాబు పొత్తు గురించి మాట్లాడాడు అంటారు.. అయితే దానికి కేటీఆర్ నో చెప్పాడని కూడా అంటారు. మరీ అప్పుడు ఈ వ్యవహారంపై ఇదే రాధాకృష్ణ ఒక్క పలుకూ పలక లేదు..అప్పుడు ఏమైంది ఈ యదార్థం? పొత్తు కుదుర్చకుందామని అడిగిన బాబు నాడు స్వయంగా కేటీఆర్ కు ఏం ఆఫర్ ఇచ్చాడు? తెలుగు నాట ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునే ఆర్కే కు ఇది తెలియలేదు? ఏపీలో పవన్ ఎలాంటి వాడో అందరికీ తెలుసు.. ఏరు దాటాక.. తెప్ప తగిలేసే రకం కాదు.. అందుకే ఓడిపోయినా జనంలోనే ఉన్నాడు. జనంతోనే ఉన్నాడు.. ఇవి ఆర్కే లాంటి వాళ్ళకు సమజ్ కావు. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టుగా…