https://oktelugu.com/

TDP: టిడిపి టికెట్లు ఇప్పించుకునే పనిలో ఏబీఎన్ రాధాకృష్ణ

గుంటూరు టికెట్ భాష్యం ప్రవీణ్ కు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ బలమైన అభ్యర్థి అవసరం అయ్యారు.

Written By:
  • Dharma
  • , Updated On : February 6, 2024 / 09:04 AM IST

    TDP

    Follow us on

    TDP: టిడిపి టికెట్ల విషయంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రమేయం ఎక్కువవుతోందా?తన సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తన సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించే పనిలో రాధాకృష్ణ బిజీగా ఉన్నారట. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ పార్లమెంట్ స్థానాల కోసం ప్రయత్నిస్తున్న ఆశావహులు.. రాధాకృష్ణ ద్వారా చంద్రబాబును ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    తెలుగుదేశం పార్టీ కోసం ఆంధ్రజ్యోతి పని చేస్తుంది. ఇది కాదనలేని సత్యం. కానీ ఎన్నికల స్ట్రాటజీ లో మాత్రం రాధాకృష్ణ మరోలా ముందుకెళ్తారు. ఎన్నికల్లో అదే టిడిపి అభ్యర్థుల ద్వారా కొంత మొత్తం వెనుకేసుకునే ప్రయత్నం చేస్తారని టిడిపి వర్గాలే చెబుతుంటాయి. చంద్రబాబు సైతం ఆర్కే మాటను కొట్టలేరు. అటు ఆర్కే సైతం ఎప్పటికప్పుడు చంద్రబాబుకు సలహాలు, సూచనలు అందిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలుపొందితే తన వల్లేనని, ఓడిపోతే తన సలహాలు పాటించలేదని చెబుతుంటారు. అయితే ఈ ఎన్నికల్లో సైతం కొంతమంది సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించేందుకు రాధాకృష్ణ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

    గుంటూరు టికెట్ భాష్యం ప్రవీణ్ కు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ బలమైన అభ్యర్థి అవసరం అయ్యారు. తొలుత ఎన్నారై చంద్రశేఖర్ గట్టి ప్రయత్నాలు చేశారు. ఆర్థికంగా గట్టి అభ్యర్థి కావడంతో ఖర్చు పెట్టేందుకు సైతం ముందుకొచ్చారు. కానీ భాష్యం ప్రవీణ్ కు చంద్రబాబు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీని వెనుక రాధాకృష్ణ ఉన్నట్లు సమాచారం. రాధాకృష్ణ ఒత్తిడి మేరకు చంద్రశేఖర్ ను తప్పించి భాష్యం ప్రవీణ్ కు చంద్రబాబు టిక్కెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.

    మొన్న ఆ మధ్యన ఆంధ్రజ్యోతిలో ఓ రాజకీయ కథనం వచ్చింది. అది కూడా టిడిపి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు కథనం ఉంది. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసే నాయకులు ఉన్నారని.. ఎన్నికల ముంగిట వచ్చే ఎన్నారైలకు టికెట్ ఎలా ఇస్తారని.. ఇచ్చినా వారు ఎలా నెగ్గుకు రాగలరని చంద్రబాబును ప్రశ్నిస్తూ ఈ కథనం ఉంది. అప్పట్లోనే ఎన్నారై చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా, భాష్యం ప్రవీణ్ కు అనుకూలంగా కథనం రాసుకొచ్చారు. ఇప్పుడు అదే చంద్రశేఖర్ ను పక్కన పెట్టి.. భాష్యం ప్రవీణ్ కు గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఒక్క గుంటూరు తోనే రాధాకృష్ణ సంతృప్తి పడడం లేదని.. ఐదు నుంచి పదిమంది నేతలకు టికెట్లు కేటాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.