Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు

తమపై విమర్శలు చేస్తున్న పవన్ ను టార్గెట్ చేసిన వైసీపీ ప్రభుత్వం తమ చేతికి మట్టి అంటకుండా వలంటీర్ల ద్వారానే నరుక్కురావాలని చూస్తోంది. అందుకే వారి చేతనే డైరెక్టు కోర్టుల్లో పిటీషన్ వేయించి కోర్టు ద్వారానే పవన్ ను కోర్టుకు లాగాలని చూస్తోంది.  

Written By: NARESH, Updated On : July 24, 2023 5:05 pm
Follow us on

Pawan Kalyan : విజయవాడ సివిల్ కోర్టులో పవన్ పై పరువునష్టం దావా దాఖలైంది. పిటిషన్ ను ఓ మహిళా వాలంటీర్ వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి పవన్ పై కేసు నమోదుకు ఆదేశించి సంచలనం సృష్టించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఓ మహిళా వాలంటీర్ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. పవన్ వ్యాఖ్యలతో తమను మానసికంగా వేధించారంటూ విజయవాడ వాలంటీర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. మధ్యాహ్న భోజనం తర్వాత విచారణ చేపడతామని తెలిపింది.

ఈ సందర్భంగా ఓ మహిళా వాలంటీర్ మాట్లాడుతూ.. తన లాయర్ ద్వారా పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. వాలంటీర్లుగా మహిళల డేటాను సేకరిస్తున్నారని, డేటాను దొంగిలించారని పవన్ అవాస్తవాలు ఆరోపించారని.., ఇది తన మనోభావాలను దెబ్బతీసిందని ఆమె ఆరోపించారు.

మహిళల అక్రమ రవాణాపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె అన్నారు. సేవ చేస్తూ వలంటీర్లపై ఆరోపణలు చేసిన పవన్‌ను చట్ట ప్రకారం శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం తాను ఒకే ఒక్క పిటిషన్ వేశానని, మరికొందరు తనను చూసిన తర్వాత వస్తారని చెప్పారు. ఈ విషయంలో ఆమెకు బార్ అసోసియేషన్ మద్దతు ఉంటుందని వాలంటీర్ తరఫు న్యాయవాది తెలిపారు.

సెక్షన్ 499, 00, 504, 505 కింద పవన్ పై కేసు పెట్టారు… బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత పవన్‌కు కోర్టు నోటీసులు జారీ చేస్తుందని, ఆ తర్వాత కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. వాలంటీర్లలో ఎక్కువ మంది మహిళలే, మహిళా అక్రమ రవాణా గురించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైనా చెప్పినట్లయితే, పవన్ కోర్టుకు ఆధారాలు ఇవ్వాలని. లేకుంటే కోర్టుకు హాజరై విచారణ ఎదుర్కొని జైలు శిక్ష ఎదుర్కోవాలంటూ మహిళా వాలంటీర్ సంచలన హెచ్చరిక చేశారు. మొత్తంగా పవన్ పై కేసు నమోదు కావడం ప్రస్తుతం సంచలనమైంది. .

తమపై విమర్శలు చేస్తున్న పవన్ ను టార్గెట్ చేసిన వైసీపీ ప్రభుత్వం తమ చేతికి మట్టి అంటకుండా వలంటీర్ల ద్వారానే నరుక్కురావాలని చూస్తోంది. అందుకే వారి చేతనే డైరెక్టు కోర్టుల్లో పిటీషన్ వేయించి కోర్టు ద్వారానే పవన్ ను కోర్టుకు లాగాలని చూస్తోంది.