Ayodhya Ram Mandir : నాడు అయోధ్యకు పుష్పక విమానంలో తరలింది వానరగణమే… కాంగ్రెసోళ్లు ఇకనైనా మారండి

అయోధ్యకు వెళుతున్న వారిని వానరాలతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్? అతడు పోస్ట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన ఫోటో వానరాల్లో రామభక్తిని ప్రదర్శిస్తుండగా..

Written By: NARESH, Updated On : January 14, 2024 8:10 pm
Follow us on

Ayodhya Ram Mandir : ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత పుట్టిన గడ్డ అయోధ్యలో రాముడికి ఆలయం నిర్మితమవుతోంది. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం మొత్తం అయోధ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇప్పటికే ఆ ట్రస్ట్ బాధ్యులు దేశవ్యాప్తంగా పేరెన్నిక గల వ్యక్తులను ఆ క్రతువుకు హాజరుకావాలని ఆహ్వానాలు పంపిస్తున్నారు. ఈ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. మేము ఆ వేడుకకు రాబోమంటూ మొహమాటం లేకుండా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. అందులో పని చేసే నాయకులు కూడా అలానే వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మొత్తం కూడా ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమం మొత్తంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. మహా అయితే వచ్చే వివిఐపీలకు భద్రత కల్పిస్తాయి. తప్పదు అనుకుంటే వసతి సౌకర్యం కూడా కల్పిస్తాయి. ఇక మిగతా బాధ్యత మొత్తం కూడా అయోధ్య ట్రస్ట్ దే. కానీ ఈ మాత్రం సోయిలేని కాంగ్రెస్ పార్టీ అయోధ్య మీద లేనిపోని ఆగ్రహం పెంచుకుంది. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మోడీ వ్యక్తిగత కార్యక్రమం అయినట్టు.. ఆ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మోడీ ఇంట్లో నుంచి చేస్తున్నట్టు భావిస్తోంది. 10 సంవత్సరాలు అధికారానికి దూరమైనప్పటికీ ఆ పార్టీ నాయకులకు ఇంకా సోయి రావడం లేదు.

కాంగ్రెస్ పార్టీ రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాబోము అని చెప్పినప్పటినుంచే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.. ఆ పార్టీ నాయకుల్లో కొంతమంది కాంగ్రెస్ అధినాయకత్వం తీరును వ్యతిరేకిస్తున్నారు కూడా.. రంజాన్ సమయంలో, క్రిస్మస్ సమయంలో వేడుకల్లో పాల్గొనే కాంగ్రెస్ పార్టీ నాయకులు.. అయోధ్య వేడుకల్లో ఎందుకు పాల్గొనడం లేదు అనే ప్రశ్న కూడా ఆ పార్టీ నాయకుల నుంచి వ్యక్తమవుతోంది. సరే ఆ పార్టీ తీరే అంత కదా.. హిందుత్వ వ్యతిరేకం అంటే చాలు ఎగిరెగిరి గంతులు వేస్తుంది. ఇప్పటికీ మోడీని వ్యతిరేకించాలి అంటే హిందుత్వకు దూరంగా ఉండటమే కరెక్ట్ అనే భావన ఆ పార్టీది. అది దాని దురవస్థ. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధికార ప్రతినిధి తన ఫేస్ బుక్ లో(తర్వాత డిలీట్ చేశాడు) ఓ ఫోటో పోస్ట్ చేశాడు. ఏంటయ్యా అంటే ఒక విమానంలో అయోధ్యకు వానర గుంపు బయలుదేరుతున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో రూపొందించిన ఫోటోలు పోస్ట్ చేశాడు. సరిగ్గా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అయోధ్యలో జరిగే రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాబోము అని చెప్పిన రోజే అతడు ఈ ఫోటోను తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. రామభక్తులు అయోధ్యకు వెళ్తున్నారు అంటూ వ్యంగ్యంగా ఇంగ్లీషులో కామెంట్ చేశాడు.

ఈ ఫోటో చూసిన తర్వాత హిందువులకు మరీ ముఖ్యంగా బిజెపి నాయకులకు కాంగ్రెస్ పార్టీ మీద మరింత జాలి కలిగింది. నాడు పుష్పక విమానంలో కూడా అయోధ్యకు తరలింది వానర గణమే.. మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటో పెట్టావు అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు దీనిని తెగ ట్రోల్ చేయడం ప్రారంభించారు. దెబ్బకు ఆ కాంగ్రెస్ అధికార ప్రతినిధికి సోయి వచ్చినట్టుంది. తట్టుకోలేక ఆ పోస్ట్ డిలీట్ చేశాడు. వాస్తవానికి అయోధ్యకు వెళ్లడం వెళ్లకపోవడం కాంగ్రెస్ పార్టీ ఇష్టం. అంతేగాని అయోధ్యకు వెళుతున్న వారిని వానరాలతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్? అతడు పోస్ట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన ఫోటో వానరాల్లో రామభక్తిని ప్రదర్శిస్తుండగా.. వానరం నుంచి మనిషిగా ఎదిగిన అతడి మేథస్సు వానరం స్థాయికి దిగజారుతున్న విధానాన్ని సూచిస్తున్నది.