https://oktelugu.com/

Baby Movie Crime : బేబీ సినిమా రిపీట్ చేసింది.. ఆ బాలిక బతుకు విషాదాంతమైంది!

ఆ బాలిక సాయికుమార్‌తో రహస్యంగా తాళి కట్టించుకున్న తరువాత కూడా సూర్యప్రకాష్‌తో ప్రేమాయణం నడిపింది. తరువాత పెళ్లి చేసుకున్న వీడియో, సూర్యప్రకాష్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటికి వచ్చి వైరల్‌గా మారాయి.

Written By:
  • NARESH
  • , Updated On : August 13, 2023 / 02:45 PM IST
    Follow us on

    Baby Movie Crime : విశాఖపట్నంలో బేబీ సినిమా తరహాలో రియల్ ట్రయాంగిల్ లవ్ స్టొరీ నడిపిన బాలిక వ్యవహారం చివరకు విషాదాంతంగా మారింది.  విశాఖపట్నంలో ఇంటర్ విద్యార్థిని (17) ఒకే సమయంలో సాయికుమార్ (23), సూర్య ప్రకాష్ (25) అనే ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపింది.

    ఆ బాలిక సాయికుమార్‌తో రహస్యంగా తాళి కట్టించుకున్న తరువాత కూడా సూర్యప్రకాష్‌తో ప్రేమాయణం నడిపింది. తరువాత పెళ్లి చేసుకున్న వీడియో, సూర్యప్రకాష్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటికి వచ్చి వైరల్‌గా మారాయి.

    దీంతో భర్త సాయికుమార్, ప్రియుడు సూర్యప్రకాష్ ఇద్దరూ ఆ బాలిక ఇంటికి వెళ్ళి మా ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకో అంటూ నిలదీశారు. మనస్థాపానికి గురైన ఆమె “సూర్య.. వాళ్లు ఎవరినీ వదలకు, కుక్క చావు చావాలి కొడుకులు” అంటూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది.

    బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా భయపడిన సూర్యప్రకాష్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాలిక మెడలో తాళి కట్టిన భర్త సాయికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.