https://oktelugu.com/

Virat Kohli : 15 ఏళ్ల విరాట్ కోహ్లీ క్రికెట్ జీవితం.. ఎన్నో మైలు రాళ్లు ఇవీ

విరాట్ కోహ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు అయిన సందర్భంగా ఈ పదిహేనేళ్ల సుధీర్ఘ క్రికెట్ ప్రయాణం

Written By:
  • NARESH
  • , Updated On : August 19, 2023 / 07:00 PM IST
    Follow us on

    Virat Kohli : సచిన్ టెండూల్కర్ రిటైర్ అయ్యాక టీమిండియా భారాన్ని మోసేది ఎవరని అందరికీ సందేహం కలిగింది. 2011 వరల్డ్ కప్ గెలిచి సచిన్ కు అంకితమిచ్చారు. ఆ సమయంలో సచిన్ ను భుజాలపై స్వయంగా మోశాడు మన విరాట్ కోహ్లీ. ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో.. దాదాపు 28 ఏళ్లు టీమిండియా భారాన్ని సచిన్ మోశాడు. ఇప్పుడు మేం మోయాల్సిన టైం వచ్చిందన్నాడు. అన్నట్టుగానే అన్ని ఫార్మాట్లలో విరాట్ సచిన్ కు వారసుడిగా ఎదిగాడు. రాణిస్తున్నాడు. ఇప్పటికీ 15 ఏళ్లుగా ఆ పరుగుల ప్రవాహం కొనసాగుతోది. విరాట్ కోహ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు అయిన సందర్భంగా ఈ పదిహేనేళ్ల సుధీర్ఘ క్రికెట్ ప్రయాణం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకం అని చెప్పుకోవాలి.

    -అండర్ 19 నుంచి మొదలు..
    2008లో దేశానికి అండర్ 19 కెప్టెన్ గా ఎంపికై వరల్డ్ కప్ ను అందించాడు మన విరాట్ కోహ్లీ. తన క్రికెట్ కెరీర్ ను ఘనంగా ఆరభించాడు. ఆపై కొన్నాళ్లకే జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. అక్కడా తన మార్క్ చూపించాడు. మొదట్లో పరుగుల కోసం నిరీక్షించాడు. కానీ ధోని లాంటి మేటి కెప్టెన్ కోహ్లీలోని పరుగు వీరుడిని గమనించి ప్రోత్సహించాడు. దీంతో కోహ్లీ తన మార్క్ చూపించాడు. రోజురోజుకు మెరుగై సెంచరీల మీద సెంచరీలు చేయడం మొదలుపెట్టాడు. రికార్డులన్నీ చెరిపేయడం షురూ చేశాడు. ఫార్మాట్ ఏదైనా సరే పరుగు వరద పారించడం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్యలా మారిపోయింది.

    -ఓపెనర్ గా కోహ్లీ ఎంట్రీ
    విరాట్ కోహ్లీ తన తొలి మ్యాచ్ ను ఈరోజే ఆడాడు. తన ఢిల్లీ టీమ్ మేట్ గంభీర్ తో కలిసి శ్రీలంకతో జరిగిన తన తొలి మ్యాచ్ లో ఓపెనింగ్ చేశాడు. ఆ మ్యాచ్ లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అలా మొదలైన విరాట్ ప్రయాణం నేటితో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో కెప్టెన్ అయ్యాడు. ఆ పదవి కోల్పోయాడు. ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నాడు. తడబడ్డప్పుడు విమర్శలు.. పరుగులు చేసినప్పుడు ప్రశంసలు.. రెండేళ్లకు పైగా సెంచరీలేక అవస్థలు.. వాటన్నంటికి మౌనంతోనే సమాధానమిచ్చాడు.

    -రికార్డుల వీరుడు
    ఇప్పటివరకూ కోహ్లీ 275 వన్డేలు, 111 టెస్టులు, 115 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 8676 పరుగులు, వన్డేల్లో 12898, టీ20 క్రికెట్ లో 4008 పరుగులు చేశాడు. అత్యధికంగా వన్డేల్లో 46 సెంచరీలు చేసిన విరాట్.. టెస్టుల్లో 26, టీ20ల్లో ఒక అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు.

    -టీ20ల్లో 115 మ్యాచుల్లో 4008 పరుగులు చేశాడు. సగటు 52.73. ఒక సెంచరీ 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోర్ 122 రన్స్. టీ20ల్లో కోహ్లీ 15 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఏడు సార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను గెలుచుకున్నాడు.

    -2011-20 కాలానికి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద డికేడ్ అవార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు.

    – అంతర్జాతీయ క్రికెట్ లో ఆయా క్రికెటర్లు ఎన్ని కి.మీలు పరిగెత్తారో లెక్కిస్తే కోహ్లీది ఖచ్చితంగా 1000 కి.మీల మార్క్ ఈజీగా దాటేస్తుంది.

    -కోహ్లీ సాధించిన రికార్డు
    -అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో క్రికెటర్ మన విరాట్ కోహ్లీ. ఇప్పటివరకూ 76 సెంచరీలు చేశాడు.

    -టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు కోహ్లీవే..

    -కోహ్లీ (20 సార్లు) అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు తీసుకున్న ఏకైక ఆటగాడు.

    -వన్డేల్లో అత్యధిక క్యాచులు పట్టుకున్నది(142) మన కోహ్లీనే