Congress 2nd list : నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల రెండో లిస్ట్ ను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఇటీవలే మొదటి జాబితాలో 55 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం తాజాగా 2వ లిస్ట్ ను విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా తీవ్ర పోటీ ఉన్న స్థానాలను కోరుకున్న సెలబ్రెటీలకే ఇవ్వడం విశేషం. క్రికెటర్ అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్, తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పాలేరు సీటును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయడం విశేషం. జూబ్లీహిల్స్ నుంచి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను బరిలోకి దింపేందుకు 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ శుక్రవారం విడుదల చేసింది.
పార్టీ జాబితా ప్రకారం.. సీనియర్లు అందరికీ వారు కోరుకున్న వారు లోకల్ కాని సీట్లనే ఇవ్వడం గమనార్హం. ఎల్.బీ నగర్ నుంచి మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్ (ఈయనది నిజామాబాద్), హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ (ఈయనది కరీంనగర్), ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్‌రెడ్డి, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర్‌రావు, మునుగోడు నుంచి కె. రాజ్‌గోపాల్‌రెడ్డిలను పోటీకి దింపింది.
దీంతో నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి వరకు మొత్తం 100 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్టైంది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటీవలే కొద్ది రోజుల ముందు పార్టీలో చేరిన రాజ్ గోపాల్ రెడ్డికి తానుకోరుకున్న సీటే ఇచ్చారు. బిజెపిలో చేరి ఒక సంవత్సరం కాకముందే తిరిగి కాంగ్రెస్ గూటికి తిరిగి వచ్చారు.
ఒక ఆసక్తికరమైన ఎత్తుగడగా జూబ్లీహిల్స్ నుండి రాజకీయవేత్తగా మారిన క్రికెటర్ అజారుద్దీన్‌ను పోటీకి దింపింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా పనిచేశారు.
అంతకుముందు రోజు ఇక్కడ జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల పేర్లపై కాంగ్రెస్ నాయకత్వం చర్చించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా తెలంగాణ నేతలు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ బుధవారం సీఈసీ సమావేశాన్ని కూడా నిర్వహించింది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. తొలి జాబితాలో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి పీసీసీ చీఫ్ అనుమల రేవంత్ రెడ్డిని, మధిర-ఎస్సీ స్థానం నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లును పోటీకి దింపారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.