https://oktelugu.com/

#NeruMovie : ప్రభాస్ ను ఢీకొని.. 100 కోట్లు సాధించిన మోహన్ లాల్.. ఇంతకీ ఈ సినిమాలో అంత ఏముందంటే?

కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి శాంతి మాయాదేవి, జీతూ జోసెఫ్ కథను అందించారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై నిర్మించారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 3, 2024 / 09:54 PM IST
    Follow us on

    #NeruMovie : షారుక్ ఖాన్ వల్ల కాలేదు. బాలీవుడ్ థియేటర్ల మాఫియా ప్రభాస్ ను అడ్డుకోవాలని చూసినప్పటికీ డుంకీ అడ్డంగా తన్నేసింది. విడుదలైన రెండో రోజు నుంచే ఆ సినిమాను థియేటర్ల నుంచి తొలగించి సాలార్ చిత్రాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. తెలుగులోనే కాదు హిందీలో కూడా సలార్ చాలా సెటిల్డ్ కలెక్షన్లు రాబడుతోంది. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ సొంత రాష్ట్రం కర్ణాటకలోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది సలార్. ఈ సినిమాలో వరదరాజమన్నార్ పాత్ర పోషించిన పృధ్వీరాజ్ సుకుమారన్ సొంత రాష్ట్రమైన కేరళలో పరిస్థితి ఏంటి? అంటే ఆ రాష్ట్రంలో సలార్ మంచి కలెక్షన్లు రాబట్టింది. బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటివరకు ఆ సినిమా దాదాపు 12 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్త మీడియా సర్కిళ్ళలో చక్కర్లు కొడుతోంది.

    Neru - Official Trailer | Mohanlal | Jeethu Joseph | Priyamani | Anaswara Rajan | Antony Perumbavoor

    సలార్ సినిమా విడుదలైనప్పుడే మలయాళ హీరో మోహన్ లాల్ నటించిన నేరు అనే సినిమా కూడా విడుదలైంది. పైగా ఈ సినిమాకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. జీతూ జోసెఫ్, మోహన్ లాల్ ది విజయవంతమైన జోడి. దృశ్యం, దృశ్యం_2, 12 మాన్ సినిమాలతో వీరిద్దరికి తిరుగులేని రికార్డు మలయాళ ఇండస్ట్రీలో ఉంది. అయితే తాజాగా వీరిద్దరి ద్వయం లో నేరు అనే కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్ర పోషించారు. విడుదలకు ముందే ఈ సినిమాకు పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా కొంతకాలం నుంచి మోహన్ లాల్ నటించిన సినిమాలు అక్కడ ప్రజాదరణ పొందుతున్నాయి. దీంతో మలయాళ సినీ పరిశ్రమ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే సలార్ సినిమా విడుదలైనప్పుడే ఈ సినిమా కూడా విడుదలైంది. సలార్ సినిమాలో పృధ్విరాజ్ నటించడం.. ఆ సినిమాను కూడా భారీగా థియేటర్లలో విడుదల చేయడంతో ఆ ప్రభావం నేరు సినిమా మీద పడింది. మొదటివారం అంతంత మాత్రమే ఈ సినిమా కలెక్షన్లు రాబట్టింది. తర్వాత చాప కింద నీరు లాగా మౌత్ పబ్లిసిటీ దక్కడంతో సినిమా రూపు ఒక్కసారిగా మారిపోయింది.

    సాధారణంగా మలయాళ సినిమాలు అరబ్ దేశాలలో ఎక్కువగా విడుదలవుతాయి. అయితే ఈ సినిమా కూడా దుబాయ్, మస్కట్ వంటి ప్రాంతాల్లో భారీ కలెక్షన్లు సాధించడం మొదలు పెట్టింది. అంతేకాదు మౌత్ పబ్లిసిటీ బాగుండడంతో కేరళలో కూడా మంచి వసూళ్ళను సాధించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు రెండు మిలియన్ డాలర్లను వసూలు చేసింది. వీటిల్లో ఎక్కువ వసూళ్లు గల్ఫ్ కంట్రీస్ నుంచే వచ్చాయి. ఇక నార్త్ అమెరికన్ మార్కెట్ లో దాదాపు ఆఫ్ మిలియన్ డాలర్ వసూళ్లు దక్కాయి. ఇక కేరళ బాక్సాఫీసులో దాదాపు 100 కోట్ల గ్రాస్ ఈ సినిమా వసూలు చేసింది. ఈ సినిమాతో మోహన్ లాల్ మంచి కం బ్యాక్ ఇచ్చారని కేరళ సినీ పండితులు చెబుతున్నారు.

    కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి శాంతి మాయాదేవి, జీతూ జోసెఫ్ కథను అందించారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై నిర్మించారు. ప్రియమణి, అనస్వర రాజన్ కీలకపాత్రలో నటించారు.. ఇక ఈ సినిమా విజయవంతం కావడంతో మోహన్ లాల్, జీతూ జోసెఫ్ వరుసగా నాలుగవ హిట్ సాధించారు. ప్రస్తుతం పోటీ చిత్రాలు ఏవి లేకపోవడం.. క్రిస్మస్ సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని మలయాళ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మొదట్లో సలార్ సినిమాతో పోటీ పడలేకపోయినా.. తర్వాత పుంజుకుని 100 కోట్ల మార్కు సాధించడం అంటే మామూలు విషయం కాదని.. అది మోహన్ లాల్ స్టామినాను రుజువు చేస్తోందని మలయాళ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.