https://oktelugu.com/

Plants Look Like Animals: జంతువులను పోలిన ఈ మొక్కలను ఎప్పుడైనా చూశారా?

వైట్ ఎగ్రెట్ ఫ్లవర్ ను పెక్టెలిస్ అని కూడా పిలుస్తారు. నార్త్ అమెరికాలో దీనికి సంబంధించిన మొక్కులు ఎక్కువగా కనిపిస్తాయి. కొంగను పోలినట్లుగా దీని పువ్వు ఉంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2023 / 11:13 AM IST

    Plants Look Like Animals

    Follow us on

    Plants Look Like Animals: ప్రకృతి ఎంతో అందమైనది. అందులో వివిధ రకాల జాతులు జీవిస్తున్నాయి. వీటిలో కొన్ని అద్భుతాలు కూడా ఉన్నాయి. మనుషుల్లో ఒకరికి పోలిన వారు మరొకరు ఉంటారు కావచ్చు.. కానీ దాదాపుగా ప్రతీ మనిషికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాగే చెట్లు ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ ప్రతీ దానికో స్పెషలైజేషన్ ఉంటుంది. ఈ భూమ్మీద 4 లక్షల జాతుల కంటే ఎక్కువ మొక్కలు ఉన్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. ఇవి ఒక దానితో మరొకటి పోలిక ఉండదు. అలాగే కొన్ని మొక్కలకు సంబంధించిన పూలు జంతువుల వలె వికసిస్తాయి. వీటిని చూస్తే అక్కడ జంతువు ఉందా? అని అనిపిస్తుంది. అలాంటి 10 రకాల పసుష గురించి తెలుసుకుందామా..

    1. ఇంపాటియన్స్ పిట్టాసిన (చిలుక పువ్వు):
    ఈ చెట్టుకు పూసే పువ్వులు అచ్చం చిలకలాగా ఉంటాయి. వాటికవే ముడుచుకొని అక్కడ పక్కి కూర్చున్నట్లు కనిపిస్తాయి. భారతదేశంతో పాటు థాయ్ లాండ్, బర్మా వంటి ఆసియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి సంబంధించిన మొక్కలు 50 మీటర్ల ఎత్తు పెరుగుతాయి.

    2. వైట్ ఎగ్రెట్ ప్లవర్:
    వైట్ ఎగ్రెట్ ఫ్లవర్ ను పెక్టెలిస్ అని కూడా పిలుస్తారు. నార్త్ అమెరికాలో దీనికి సంబంధించిన మొక్కులు ఎక్కువగా కనిపిస్తాయి. కొంగను పోలినట్లుగా దీని పువ్వు ఉంటుంది. ఈ మొక్కలు అరుదుగా కనిపిస్తాయి. పర్వత ప్రాంతాల్లో సుమారు 1500 మీట్ల ఎత్తులో పెరుగుతుంది.

    3. మంకీ ఆర్కిడ్:
    అచ్చం కోతి ముఖంలా కనిపించే ఈ మొక్కల పుష్పాలు దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇది సముద్ర మట్టానికి 1200 నుంచి 2000 మీటర్ల మధ్య పెరుగుతుంది. కోతి భయపడినట్లు చూస్తూ ఉండే పువ్వు మొక్క అసాధారణమైనది.

    4. రాబిట్ సక్యులెంట్:
    సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిందే ఇది అచ్చం కుందేలులా కనిపిస్తుంది. ఈ మొక్క కాండాలు కుందేలు చెవుల వలె మలుచుకొని ఆకర్షిస్తాయి.

    5. డాల్పిన్ సక్యులెంట్:
    ఈ మొక్క ఎక్కువగా దక్షిణాఫ్రికాలో కనిపిస్తుంది. దీని ఆకులు డాల్ఫిన్ చేప వలె తిరిగి ఉంటాయి. పచ్చని రంగులో ఉండే వీటిని ప్రత్యేకంగా చూస్తే గానీ కనిపించవు.

    Plants Look Like Animals

    6. డోవ్ అర్చిడ్:
    ఈ మొక్కకు సంబంధించిన పూవులు పనామా నుంచి పెరిస్టెరియా ఎలాటా ఆర్చిడ్ అనే శాస్త్రీయ నామాన్ని కలిగి ఉంది. మధ్య ఆఫ్రికాలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

    7. కంగారూ పా:
    ఇది 12 రకాల మొక్కల సమూహం. శీతాకాలం చివరలో ఈ మొక్క పువ్వులు పూస్తుంది. అచ్చం కంగారు జంతువు వలు దీని రెక్కలు విచ్చుకుంటాయి. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనినిస్తంది.

    8. రెడ్ బటర్ ఫ్లై:
    ఎగురుతున్న సీతాకోక చిలుకలా కనిపించే ఈ మొక్క పుష్పం ఎక్కువగా బ్రెజి ల్ లో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మొక్క 60 నుంచి 120 సెంటిమీటర్లు పెరుగుతుంది.

    Plants Look Like Animals

    9. ఫ్లై ఆర్కిడ్:
    ఎగురుతున్న కందిరీగలా కనిపిస్తుందిఈ మొక్క పుష్పం. యూరోప్ లో మాత్రమే కనిపించే ఈ అరుదైన మొక్క పరాగ సంపర్కం కోసం దానిపై వాలే కీటకాలతో పోరాడుతుంది.

    10. బాట్ ఫ్లవర్:
    ఆగ్నేసియా దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ మొక్క పర్పుల్ కలర్లో ఆకర్షిస్తుంది. దీని పుష్పంలో నుంచి తీగలు బయటకు వచ్చినట్లు కనిపించి అలరిస్తుంది