https://oktelugu.com/

Two Beautiful Couple: తరుణ్, ఉదయ్ కిరణ్.. జంటగా ఇద్దరు సుందరాంగులు.. ఆ అరుదైన ఫొటో వైరల్

2000 సంవత్సరంలో యూత్ ఎక్కువగా లవ్ సినిమాలు ఇష్టపడేవారు. దీంతో చాలా సినిమాలు లవ్ ఓరియెంటెడ్ నేపథ్యంలో వచ్చేవి. వీటిలో కొన్ని బంపర్ హిట్టు కొట్టగా..మరికొన్ని కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా.. యూత్ ను మాత్రం బాగా ఇంప్రెస్ చేశాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 2, 2024 / 01:03 PM IST

    Tarun Uday Kriran viral pic

    Follow us on

    Two Beautiful Couple: 2000 సంవత్సరంలో యూత్ ఎక్కువగా లవ్ సినిమాలు ఇష్టపడేవారు. దీంతో చాలా సినిమాలు లవ్ ఓరియెంటెడ్ నేపథ్యంలో వచ్చేవి. వీటిలో కొన్ని బంపర్ హిట్టు కొట్టగా..మరికొన్ని కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా.. యూత్ ను మాత్రం బాగా ఇంప్రెస్ చేశాయి. ప్రస్తుతం చాలా సినిమాలు రావడానికి సమయం తీసుకుంటున్నాయి. కానీ ఆ సమయంలో వరుసగా లవ్ స్టోరీలు వచ్చేవి. ఈ క్రమంలో ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు తమ సినిమాలు ప్రమోషన్ చేసుకునే క్రమంలో ఒక చోట కలిశారు. ఈ సందర్భంగా వారి హీరోయిన్లతో కలిసి హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో షికారు కొట్టినట్లు అప్పుడు ఫొటో తీసిన కొందరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంచారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది. ఈ ఫొటో స్టోరీలోకి వెళ్తే..

    21వ దశాబ్దం ప్రారంభ సమయంలో యంగ్ హీరోల హవా సాగింది. వీరు తీసే కొన్ని సినిమాలను ఎగబటి చూసేవారు. వీరిలో ఉదయ్ కిరణ్, తరుణ్ లు ప్రత్యేకగా గుర్తింపు పొందారు. వీరుఎక్కువగా లవ్ యాంగిల్స్ లో తీసిన సినియాలు తీయడంతో వీరికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ప్రేక్షకుల్లో ఈ యంగ్ హీరోలపై క్రేజ్ పెరగడంతో కొందరు డైరెక్టర్లు వీరి కోసం క్యూలో ఉన్నారు. ఈ క్రమ్ంలో 2005 సంవత్సరంలో తరుణ్, ఆర్తి అగర్వాల్ జోడీగా ‘సోగ్గాడు’.. ఉదయ్ కిరణ్, సదా కలిసి ‘ఔనన్నా కాదన్నా’ అనే సినిమాలు తీశారు.ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ లో ఓ ప్రదేశంలో కలిశారు. ఈ క్రమంలోవారు తమ హీరోయిన్లతో కలిసి హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో షికారుకొచ్చారు. ఈ సందర్భంగా కొందరు వీరిని ఫొటో తీశారు. ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో ఉంచడంతో అది వైరల్ గా మారుతోంది.

    తరుణ్, ఆర్తి అగర్వాల్ జోడీగా నటించిన ‘సోగ్గాడు’ సినిమా 2005లో రిలీజ్ అయింది. ఇందులో ఒక అమ్మాయిని ఓ అబ్బాయి ఇష్టపడుతాడు. కానీ ఆ అమ్మాయి వేరే వ్యక్తి లైక్ చేస్తుంది. అయితే ఇంట్లో నుంచి బయటపడడానికి తన కోసం వెంటపడే అబ్బాయిని వాడుకుటుంది. ఆ తరువాత ఈ విషయం తెలిసి ప్రేమించిన అబ్బాయి బాధపడుతాడు. కానీ చివరికి ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. ఇందులో స్టోరీతో పాటు మ్యూజిక్ బాగా ఆకట్టుకుంటుంది. ఇందులోని పాటలు ఇప్పటికీ ఆకట్టుకుంటాయి.

    మరో హీరో ఉదయ్ కిరణ్, సదాలు కలిసి ‘ఔనన్నా కాదన్నా’ అనే సినిమాలో నటించారు. తేజ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సక్సెస్ అనిపించుకోకపోయినా యూత్ మాత్రం లైక్ చేశారు. లక్ష్యం కోసం యువకుడు, ఆ యువకుని కోసం యువతి లైక్ చేయగా.. ఆ తరువాత ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి కోసం తీవ్రంగా శ్రమిస్తారు. ఈ సినిమాలోనూ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. మ్యూజికల్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకున్న ఇందులో కామెడీ ప్రధానంగా నిలుస్తుంది. అయితే దురదృష్టవశాత్తూ వీరిలో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ మనమధ్య లేరు.కానీ వారు తీసిన సినిమాలు మాత్రం ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాయి.