Photo Story: కానీ మీకు టాలీవుడ్ లో అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు అని చెప్పొచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం తెలుగులో ఈమె తోపు హీరోయిన్. మీనాక్షి చౌదరి తెలుగులో ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పలకరించింది. ఆ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన కిలాడి సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన కూడా ఈమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత మీనాక్షి చౌదరి హిట్ 2 సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మీనాక్షి చౌదరి గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్ గా మీనాక్షి చౌదరి హీరో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మరొక హీరోయిన్ గా కనిపించింది.
Also Read: మహేష్ బాబు తర్వాత నానినే, బడా స్టార్స్ కూడా ఆయన వెనకే!
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఈ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మీనాక్షి చౌదరి కెరియర్ వరస అవకాశాలు అందుకొని దూసుకుపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోయింది. టాలీవుడ్ లో ఈమెకు చిన్న హీరోల సినిమాలు తప్ప స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం మాత్రం రావడం లేదు. అయిన కూడా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మీనాక్షి చౌదరి వినియోగించుకుంటుంది.

అయితే సామాజిక మాధ్యమాలలో మీనాక్షి చౌదరికి తన హైట్ మరియు శరీరాకృతి మైనస్ అయ్యాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ లకు ఉండాల్సిన సగటు హైట్ కంటే కూడా మీనాక్షి చౌదరి కొంచెం ఎక్కువ హైట్ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఆఫర్స్ అంతగా రావడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా మీనాక్షి చౌదరి చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోషూట్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. రీసెంట్గా ఎల్లో కలర్ శారీలో మీనాక్షి చౌదరి షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నాయి.