https://oktelugu.com/

Childhood Pic, There Is a Hero: ఈ చిన్ననాటి పిక్ లో ఓ హీరో తో పాటు తన భార్య కూడా ఉన్నారు.. ఆయన ఎవరో తెలుసా?

సినిమాల నటుల గురించి తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. అందుకే కొందరు వీటికి సంబంధించిన న్యూస్ ఎక్కువగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల గురించి తెలుసుకోవాలని కొందరు వారి గురించి సెర్చ్ చేస్తుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 18, 2024 / 02:32 PM IST

    Siva Karthikeyan

    Follow us on

    Childhood Pic, There Is a Hero: సినిమాల నటుల గురించి తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. అందుకే కొందరు వీటికి సంబంధించిన న్యూస్ ఎక్కువగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల గురించి తెలుసుకోవాలని కొందరు వారి గురించి సెర్చ్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారికి సంబంధించిన ఫొటోస్ బయట పడుతూ ఉంటాయి. ఇలా వారి చిన్ననాటి ఫోటో లభించడంతో వాటితో సోషల్ మీడియాలో సందడి చేస్తారు. తాజాగా ఓ హీరోకు సంబంధించిన చిన్ననాటి ఫోటో బయటకు వచ్చింది. అయితే హీరో మాత్రమే కాకుండా తాను పెళ్లి చేసుకున్న అమ్మాయికి సంబంధించిన చిన్ననాటి ఫోటో కూడా అందులో ఉంది. అంటే ఇద్దరూ చిన్ననాడే ఒకే ఫ్రేమ్లో కనిపించారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

    తమిళ ఇండస్ట్రీకి చెందిన హీరోలు తెలుగులో కూడా పాపులర్ అవుతూ ఉంటారు. చాలామంది హీరోయిన్లు తమిళ ఇండస్ట్రీలో స్టార్లు కాకపోయినా.. తెలుగులో వారికి ఆదరణ పెరుగుతూ ఉంటుంది. తమిళ హీరో శివ కార్తికేయన్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయనకు సంబంధించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులో డబ్ కావడంతో అవి సక్సెస్ సాధించాయి. దీంతో శివ కార్తికేయల్ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత నేరుగా తెలుగు సినిమాల్లోనూ నటించారు.

    శివ కార్తికేయన్ మొదట్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. మిమిక్రీతో ప్రేక్షకులను అలరించేవారు. ఈ క్రమంలో ‘కలక్క పోవతు ఎవరు?’ అనే కామెడీ షో కి మిమిక్రీ అందించాడు. ఆ తర్వాత 2012 సంవత్సరంలో పాండి రాజ్ తీసిన చిత్రం మెరీనాలో మొదటిసారిగా కనిపించాడు. ఆ తర్వాత 2016 సంవత్సరంలో ‘రేమో’ అనే సినిమా హిట్టు కావడంతో పాపులర్ అయ్యారు. ఈ సినిమా తెలుగులో కూడా ఆకట్టుకోవడంతో ఆయనకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఈ క్రమంలో ఆయన సినిమా కోసం ఎదురు చూసేవారు ఎక్కువయ్యారు .
    తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది. అలాగే మ్యూజికల్ గాను సినిమా సక్సెస్ సాధించింది దీంతో శివ కార్తికేయనుకు తెలుగులో ప్రత్యేకంగా ఫ్యాన్స్ అయ్యారు. ఇటీవల అమరన్ అనే సినిమాతో కనిపించిన శివ కార్తికేయన్ నటనపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఏ మూవీ మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథతో తెరకెక్కింది. ఇక శివ కార్తికేయన్ నిర్మాతగా కూడా ప్రత్యేకత సాధించుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో డాక్టర్, డాన్ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ ఈయనకు మంచి పేరు ఉంది. శ్రీధర్ అనే సినిమాలో సిద్ధార్థ కు శివ కార్తికేయన్ డబ్బింగ్ చెప్పాడు
    అయితే ఈ హీరోకు సంబంధించిన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్న మరో అమ్మాయి ఎవరో కాదు. శివ కార్తికేయన్ పెళ్లి చేసుకున్న ఆర్తి .2010 సంవత్సరంలో తమ బంధువుల అమ్మాయి అయినా ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.