https://oktelugu.com/

Akhanda 2 : అఖండ 2 లో స్పెషల్ పాత్రలో కనిపించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. ఇక మొదటి తరం హీరోలు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు... ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్లు సినిమాలను చేస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 25, 2024 / 03:44 PM IST

    Yesteryear star heroine who will be seen in a special role in Akhanda 2...

    Follow us on

    Akhanda 2 : బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కు ఎంత మంచి గుర్తింపు ఉందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ప్రతి సినిమా కూడా భారీ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికే మూడు సినిమాలతో వచ్చి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నారు.ఇక ఇప్పుడు వీళ్ళు నాలుగో సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అఖండ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 సినిమా కు సంబంధించిన భారీ కసరత్తులను చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో బాలయ్య బాబుతో నటించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ నటించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే విజయశాంతిగా తెలుస్తోంది. ఒకప్పుడు బాలయ్య బాబు పక్కన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపును తెచ్చుకున్న ఆవిడ ఇప్పుడు బాలయ్య బాబు సినిమాలోనే ఒక వైవిద్య భరితమైన పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకప్పుడు వీళ్ళ కాంబోకి మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఆన్ స్క్రీన్ మీద బాలయ్య బాబు విజయశాంతి కెమిస్ట్రీ అనేది బాగా వర్కౌట్ అయ్యేది. మరి ఇప్పుడు ఆమె ఎలాంటి పాత్రలో నటిస్తుందనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
    నిజానికి విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో కూడా నటిస్తూ తను చాలా బిజీగా ఉంది. ఇక అటు పొలిటిషన్ గా బిజీగా ఉన్నప్పటికీ ఇటు సినిమాల్లో కూడా నటిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆమె బాలయ్య బాబు సినిమాలో నటిస్తుందనే విషయాన్ని తెలుసుకున్న నందమూరి అభిమానులు సైతం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
    ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి బాలయ్య బాబు బోయపాటి భారీ కసరత్తులైతే చేస్తున్నారు. మరి విజయశాంతి ఈ సినిమాలో నటిస్తుందా? లేదా అనే విషయం మీద సినిమా యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.
    ఇక సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి ఈ సినిమాలో విజయశాంతి నటిస్తుందంటూ ప్రచారం అయితే జరుగుతుంది. మరి సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే గాని సినిమాలో ఆమె  నటిస్తుందా లేదా అనే విషయం మీద క్లారిటీ రాదు…