https://oktelugu.com/

Trivikram, Allu Arjun : త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో లో సినిమా ఉంటుందా..? మరి ఈ మౌనానికి కారణం ఏంటి..?

తెలుగు సినిమా అనగానే చాలా మంది కి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకు వస్తారు. కానీ సినిమా ఇండస్ట్రీలో దర్శకులు కూడా ముఖ్యపాత్ర వహిస్తూ ఉంటారు. నిజానికి స్క్రీన్ మీద కనిపించేది హీరోనే కాబట్టి ప్రేక్షకులు హీరోల మీదనే ఎక్కువ అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 26, 2024 / 02:42 PM IST

    Will there be a movie in Trivikram Allu Arjun combo..? And what is the reason for this silence?

    Follow us on

    Trivikram, Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఏదో ఒక విధంగా సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా తనను తాను స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో త్రివిక్రమ్ తన తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడు అనే దానిమీదనే ప్రస్తుతం సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో ఒక సినిమా రాబోతుంది అంటూ చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా కూడా ఫైనల్ అయినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. కానీ ఓపెన్ గా ఎందుకు అనౌన్స్ చేయడం లేదు. త్రివిక్రమ్ అల్లు అర్జున్ నిర్ణయాల పట్ల ఎందుకు సామరస్యత కుదరడం లేదనే దానిమీదనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా చేయడానికి అల్లు అర్జున్ చాలావరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికి ఎక్కడో కొంతవరకైతే ఆయనకి తెలియని ఇబ్బంది కూడా కలుగుతుందట. ఎందుకంటే ఈ సినిమా ద్వారా భారీ సక్సెస్ ని అందుకోబోతున్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ తో చేస్తే ఆయన మార్కెట్ అనేది భారీగా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
    ఎందుకంటే పుష్ప 2 సినిమా తర్వాత ఆయనకి చాలా క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇక త్రివిక్రమ్ కి పాన్ ఇండియా లో అసలు మార్కెట్ లేదు. కాబట్టే అల్లు అర్జున్ అతనితో సినిమా చేయలా వద్దా అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఆయన సినిమాకి కమిట్ అయినప్పటికి అంత సంతృప్తి గా లేనట్టుగా తెలుస్తోంది.
    ఒక రకంగా ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అని కొంతమంది భావిస్తుంటే మరి కొంత మంది మాత్రం ఈ ప్రాజెక్టు ఎప్పుడైనా సరే క్యాన్సిల్ అయిపోవచ్చు అనే ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నారు. మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు మిగతా హీరోల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవాలంటే మాత్రం వరుస సినిమాలతో సాధించాల్సిన అవసరమైతే ఉంది.
    మరి అల్లు అర్జున్ కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నట్టుగా తెలుస్తోంది…ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ – సందీప్ వంగ కాంబోలో కూడా ఒక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఈ సినిమా కూడా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది…