Telugu News » Photos » Cinema Photos » Will the movie breathe in small heroes is kiran abbavaram horoscope going to change
Ka : క’ సినిమా చిన్న హీరోల్లో ఊపిరిపోస్తుందా..? కిరణ్ అబ్బవరం జాతకం మారబోతుందా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సెకండ్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది ప్రస్తుతం వాళ్లు చిన్న సినిమాలతో వచ్చి పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నారు ఇక అందులో భాగంగానే కిరణబ్బవరం లాంటి నటులు కూడా ఇప్పుడు మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు కూడా పెంచుకునే విధంగా ముందుకు సాగుతున్నారు
Ka : కిరణ్ అబ్బవరం లాంటి హీరో ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు రావడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఆయన చేస్తున్న క సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ ని క్రియేట్ చేయడమే కాకుండా కిరణ్ అబ్బవరంకి కూడా ఒక కొత్త ఇమేజ్ ని ఇవ్వబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందనేది తెలియాల్సి ఉంది.ఇక ఇలాంటి ఒక కొత్త ఛానల్ లో సినిమాని ఎక్స్పెక్ట్ చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయం అనే చెప్పాలి. యంగ్ హీరోలు పాన్ ఇండియా సబ్జెక్టులను చేసి సక్సెస్ సాధించే సత్తా ఉందా? లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా ఫలితాన్ని బట్టి చూస్తే తెలుస్తోంది. ఇక మొత్తానికైతే స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా రేస్ లో ముందుకు దూసుకెళ్తుంటే యంగ్ హీరోలు ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా బాట పడుతున్నారు. మరి కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మరి కొంతమంది చిన్న హీరోలకి ఊపిరి పోసిన వాడు అవుతాడు.
ఇక వాళ్ళు కూడా పాన్ ఇండియా బాట పట్టి మంచి సినిమాలను చేసే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆ సినిమాలో విజువల్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినర్ గా ఉన్నాయి. సుజిత్, సందీప్ అనే ఇద్దరు దర్శకులు కలిసి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఈనెల 31వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో సక్సెస్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న కిరణ్ అబ్బవరం ఈ సినిమా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం ఆయన క్రేజ్ తారాస్థాయిలో పెరుగుతుంది. అలాగే తన రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లో పెంచే అవకాశాలైతే ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది…
ఇంతకుముందు వరసగా ఐదారు సినిమాలతో ఫ్లాప్ లను మూట గట్టుకున్న ఈయన కెరియర్ ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే సాఫీగా సాగుతుంది. లేకపోతే మాత్రం మళ్ళీ డౌన్ ఫాల్ అవ్వాల్సిన అవసరమైతే ఏర్పడుతుంది. అందుకే ఆచితూచి మరి ఈ సబ్జెక్ట్ ని ఎంచుకొని సినిమాగా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది…