https://oktelugu.com/

NTR : ఎన్టీయార్ దేవర బాటలోనే గేమ్ చేంజర్ నడుస్తుందా..? అలా అయితే దిల్ రాజు కి భారీ నష్టం తప్పదా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో తనదైన రీతిలో సత్తాని చాటి తనకంటూ ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను అందుకుంటుంటాయి. కాబట్టి హీరోలు తమ హవాని కొనసాగించాలని చూస్తూ ఉంటారు. ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళ క్రేజీని చూపిస్తూ ఎక్కువ రెమ్యూనరేషన్ ను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 / 11:57 AM IST

    Will the game changer run on the path of NTR Devara..? If so, Dil Raju will suffer a huge loss..?

    Follow us on

    NTR : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వస్తున్న చాలా మంది యంగ్ హీరోలు కూడా స్టార్ హీరోలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళ సత్తా చాటుతూ ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రికార్డులను క్రియేట్ చేస్తూ ఉండటం విశేషం. ఇక ప్రస్తుతం మన హీరోలు బాలీవుడ్ హీరోలకి సైతం చెమటలు పట్టిస్తున్నారనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందంటూ దిల్ రాజు కామెంట్లు చేస్తున్నాడు. ఇక తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. దాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబడితేనే పర్లేదు.

    లేకపోతే మాత్రం దిల్ రాజు భారీగా నష్టపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇక రామ్ చరణ్ మీదనే పూర్తి భారాన్ని వేసిన సినిమా యూనిట్ రామ్ చరణ్ ఒక్కడే తన భుజ స్కందలపై ఈ సినిమాని భారీ సక్సెస్ దిశగా మోసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో రీసెంట్ గా రిలీజైన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కేవలం 300 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టింది.

    మరి ఆ సినిమా మాదిరిగానే గేమ్ చేంజర్ సినిమా కూడా చతకిలబడితే మాత్రం ప్రొడ్యూసర్ భారీగా నష్టపోయే అవకాశాలైతే ఉన్నాయి. నిజానికి ఈ మధ్య కాలం లో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన సినిమాకి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ని క్రియేట్ చేసే కెపాసిటీ అయితే ఉంది.

    కాబట్టి రామ్ చరణ్ మీదనే పూర్తి భారాన్ని వేసిన సినిమా యూనిట్ ఈ సినిమాతో ఎలాగైనా సరే 1000 కోట్ల కలెక్షన్లను సాధించాడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది… ఇక శంకర్ తన గత సినిమా అయినా ‘భారతీయుడు 2’ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో కూడా సక్సెస్ ని సాధిస్తేనే పర్లేదు. కానీ లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా పడిపోతుందనే చెప్పాలి…