Telugu News » Photos » Cinema Photos » Will the family audience watch the movie spirit is there any possibility of damage to prabhas image due to sandeep vanga
Spirit & Prabhas : స్పిరిట్ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ చూస్తారా..? సందీప్ వంగ వల్ల ప్రభాస్ ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా..?
ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్లందరిలో సందీప్ రెడ్డివంగా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.పాన్ ఇండియాలో ఆయనను మించిన నటుడు ప్రస్తుతానికైతే ఎవరూ లేరు తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. ఇకమీదట కూడా ఇదేవిధంగా భారీ సక్సెస్ లను అందుకుంటే ఇండియాలో ఆయన మించిన నటుడు మరొకరు ఉండరని ఇంతలా గుర్తింపును సంపాదించుకుంటాడు...
Spirit & Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న విషయం మనకు తెలిసిందే…నిజానికి ఈయన చేసే సినిమాల్లో వైలెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుందనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక ఆయన బోల్డ్ సినిమాలు చేయడం లో ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నాడు. కాబట్టి ఈయన సినిమాకి ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్ కి రావడం మానేశారు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ప్రభాస్ తో చేస్తున్న సినిమా కూడా బోల్డ్ కంటెంట్ తెరకెక్కుతుంది. ఇక మొత్తానికైతే ప్రభాస్ సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తూ ఆదరిస్తూ ఉంటారు. మరి సందీప్ రెడ్డి వంగ తో చేసే సినిమా వల్ల ప్రభాస్ ఇమేజ్ కి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే విధంగా కూడా అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరోని పెట్టుకొని ఆయన బోల్డ్ కంటెంట్ తో సినిమా తెరకెక్కిస్తున్నాడని ప్రభాస్ అభిమానుల్లో కొంతవరకు ఆవేదన అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ప్రభాస్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో తో మాస్ సినిమా చేస్తే ఇండస్ట్రీ హిట్టు కొడుతుంది. అలా కాదని ఇలాంటి బోల్డ్ కంటెంట్ తో సినిమా చేస్తే ఎవరు చూస్తారు అనే విధంగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ప్రభాస్ అభిమానులు ఇప్పుడు ఈ విషయంలో చాలా వరకు భయపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ ఎవరిని లెక్క చేయకుండా తనకు ఏది అనిపిస్తే అది చేస్తూ ఉంటాడు.
అలా కాకుండా డిఫరెంట్ సినిమాలను చేయాలని చూస్తే మాత్రం కొంతవరకు ప్రేక్షకుల నుంచి ఆదరణ రాకపోవచ్చు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహిస్తూ సినిమా చేస్తే అది ఈజీగా ఇండస్ట్రీ హిట్టు కొడుతుంది.
అలా కాదని ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు తీస్తే ఆ సినిమా మొదటికి మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కొంతమంది ప్రభాస్ అభిమానులు తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవడం సందీప్ రెడ్డి వంగా భారీ గుర్తింపును సంపాదించుకున్నాడు.
మరి తన బోల్డ్ ఇమేజ్ ప్రభాస్ ఇమేజ్ కి ఏదైనా ఆటంకం కలిగించే ప్రమాదం కూడా ఉందని కొంతమంది సినీ మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు…చూడాలి మరి సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాతో ఎలాంటి ఇమేజ్ ను సొంతం చేసుకుంటాడు అనేది…