https://oktelugu.com/

Game Changer : గేమ్ చేంజర్ లో ఆ ట్రైన్ ఫైట్ హైలెట్ గా నిలువనుందా..? దానికోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?

సినిమా అంటే చాలు ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఉంటుంది. ప్రేక్షకుడిని మూడు గంటల పాటు ఎంటర్ టైన్ చేయడంలో సినిమా చాలా కీలకపాత్ర వహిస్తుంది. ప్రేక్షకులు వాళ్ళకున్న ఇబ్బందులను పోగొట్టుకోవడానికి థియేటర్ కి వస్తారు. అలాగే వాళ్ళని ఒక 3 గంటల పాటు ఎంటర్ టైన్ చేసి పంపించడంతో సినిమా యూనిట్ సక్సెస్ అయితే సినిమా భారీ హిట్ కొడుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 08:22 AM IST

    Will that train fight be the highlight in Game Changer? Do you know how much it cost?

    Follow us on

    Game Changer : శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తునట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినప్పటికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చాలా బిజీగా ఉంది. నిజానికి ఇందులో చాలా వరకు గ్రాఫిక్ షాట్స్ ఉండడంతో శంకర్ పోస్ట్ ప్రొడక్షన్ మీద చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రతి ఫ్రేమ్ ని అబ్జర్వ్ చేస్తూ ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో శంకర్ తన స్టార్ డమ్ ను ప్రూవ్ చేసుకోవడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ ని కూడా క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక తద్వారా పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ఇక రామ్ చరణ్ ఇప్పటికే పాన్ ఇండియాలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. కాబట్టి తనను వాడుకొని ఒక భారీ సక్సెస్ ని కొట్టాలని ప్లాన్ చేస్తున్న శంకర్ కి ఇది మంచి అవకాశమనే చెప్పాలి.

    ఇక ఈ సంవత్సరం జూలైలో వచ్చిన సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్న ఆయన ఇప్పుడు ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే ఆయన మార్కెట్ భారీగా డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలు లేకపోలేదు…ఇక ఇలాంటి క్రమంలోనే శంకర్ ఆచితూచి మరి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన సినిమాలేవీ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు.

    కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే తను భారీ సక్సెస్ సాధించి రామ్ చరణ్ కి కూడా భారీ సక్సెస్ ని అందించాలని చూస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఒక ట్రైన్ ఫైట్ చాలా అద్భుతంగా వచ్చిందట. ఈ సినిమా మొత్తానికిదే హైలైట్ కి నిలువబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ ట్రైన్ ఫైట్ కోసం దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు చేశారట. అయినప్పటికి విజువల్స్ పరంగా ఈ సినిమాలోని ట్రైన్ ఫైట్ ఎక్కడ ఎవరిని నిరాశపరచకుండా ఉంటుందట.

    ఇక ఇది చాలా ఎలివేషన్స్ తో కూడిన ఫైట్ అని కూడా తెలుస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఎలా ఉంది సినిమా సక్సెస్ సాధించిందా లేదా అనేది తెలియదు. ఇక ఈ సంక్రాంతికి రామ్ చరణ్ సక్సెస్ కొడతాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…