https://oktelugu.com/

Sai Pallavi : అమరన్ సినిమాలో సాయి పల్లవి నటనకి నేషనల్ అవార్డు వస్తుందా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీకి లెవెల్ లో ఒక మంచి గుర్తింపు అయితే ఉంది సాయి

Written By:
  • Gopi
  • , Updated On : November 4, 2024 / 01:08 PM IST

    Will Sai Pallavi get a National Award for her performance in Amaran?

    Follow us on

    Sai Pallavi : శివ కార్తికేయన్ హీరోగా సాయిపల్లవి హీరోయిన్ గా వచ్చిన ‘అమరన్ ‘ సినిమా రీసెంట్ గా రిలీజైంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం సక్సెస్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. నిజానికి ఒకప్పటి ఆర్మీ మేజర్ అయిన ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. నిజానికి శివ కార్తికేయన్ ఈ సినిమాలు చాలా అద్భుతంగా నటించాడు. ఇక తనకు సపోర్టుగా చేసిన సాయి పల్లవి అయితే తన కెరియర్ లోనే ది బెస్ట్ పర్ఫామెన్స్ ను ఇచ్చింది. ఆమె నటనకు విమర్శకులు సైతం ఫిదా అయి పోయారు. నిజానికి ఫిదా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు అప్పట్నుంచి ఇప్పటివరకు తనదైన రీతిలో నటనను కనబరుస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో ఆమె అద్భుతంగా నటిస్తూనే ఎక్కడ కూడా అతిగా అనిపించకుండా నటించడం విశేషం…

    ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆమె తన నట విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా హీరోలకి ఏమాత్రం తీసిపోని రీతిలో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకోవడంలో కూడా చాలా ముందు వరుస లో ఉంది. ఇక ఏది ఏమైనా కూడా శివ కార్తికేయన్ లాంటి హీరో ఎలాంటి నటనని అయితే కనబరిచాడో తనకు ఏమాత్రం తీసిపోకుండా సాయి పల్లవి చాలా సెటైల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చింది.

    ఆమె క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటేనే ఆమె సినిమా చేస్తుంది. లేకపోతే మాత్రం సినిమాలను చేయదనే విషయం మనకు ఇప్పటికే అర్థమైపోయింది. కాబట్టి ఆమె కోసం రాసే ప్రతి పాత్రలో కూడా ఆమె ఎలివేట్ అయ్యే విధంగానే ఉండాలి లేకపోతే మాత్రం ఆమె ఆ సినిమాని చేయదు. నిజానికి ఆమె పాత్రకి ఆమె జీవం పోస్తుంది.

    దాని వల్ల కూడా డైరెక్టర్ రాసిన దాని కంటే ఆమె పర్ఫామెన్స్ చేయడంతోనే ఆ క్యారెక్టర్ కి చాలా మంచి గుర్తింపు అయితే వస్తుందనేది ఆమె ఇప్పటివరకు చేసిన చాలా సినిమాలను మనం అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను స్టార్ హీరోయిన్ గా ఎలివేట్ చేసుకోవడంలో మాత్రం ఆమె సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా గ్లామర్ రోల్ కి నో చెబుతూనే నటనకి స్కోప్ ఉన్న పాత్రలను చేస్తూ సక్సెస్ ని సాధిస్తూ వస్తుంది…