https://oktelugu.com/

Rajinikanth & Rajamouli : రజినీకాంత్ తో రాజమౌళి చేయాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయింది…

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతారు. ఇక ఎప్పుడైతే వాళ్లకు సపరేటు ఐడెంటిటీ వస్తుందో వాళ్లను వాళ్ళు భారీగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 11, 2024 / 09:01 AM IST

    Why was Rajamouli's film with Rajinikanth stopped?

    Follow us on

    Rajinikanth & Rajamouli : ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారిన వాళ్లలో రాజమౌళి ఒకరు. ప్రస్తుతం ఆయన నుంచి ఒక సినిమా వచ్చింది అంటే చాలు యావత్ ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిలో అటెన్షన్ క్రియేట్ చేసే విధంగా ఆయన సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఎప్పుడైతే ఆయన నుంచి ఒక సినిమా వస్తుందో అప్పుడు ప్రేక్షకులందరూ అమితమైన ఇష్టంతో ఆ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కారణం ఏదైనా కూడా ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు పోటీ పడుతూ ఉంటారు. నిజానికి సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా రాజమౌళి ఒక సినిమా చేయాల్సింది. రజనీకాంత్ శివాజీ సినిమా చేసిన తర్వాత రాజమౌళి రజనీకాంత్ కి ఒక కథ వినిపించారు. ఆ కథ కూడా సెట్ అయింది. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న సమయంలోనే శంకర్ రోబో సినిమా స్టోరీ చెప్పి రోబో సినిమా కోసం రజినీకాంత్ వెళ్లడంతో రాజమౌళి రజనీకాంత్ కాంబినేషన్ లో సినిమా అనేది వర్కౌట్ కాలేదు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం ఇప్పటికీ ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కొడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న రజనీకాంత్ ఇప్పుడు కూడా యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు.

    మరి ఆయన లాంటి సూపర్ స్టార్ హీరోలు ఎప్పుడూ సినిమా కోసమే పరితపిస్తూ ఉంటారు. మరి ఇలాంటి హీరోకి రాజమౌళి లాంటి దర్శకుడు తగిలితే మాత్రం ఆయనలోని ఎమోషన్స్ అన్ని భారీ రేంజ్ లో ఎలివేట్ అవుతాయనే చెప్పాలి. మరి అలాంటి నటుడు రాజమౌళితో సినిమా చేసే అవకాశం వచ్చినా కూడా వదులుకోవడం అనేది నిజంగా రజనీకాంత్ దురదృష్టమనే చెప్పాలి…

    ఇక ఇప్పటికే రాజమౌళితో సినిమా చేయడానికి ప్రతి ఒక్క హీరో క్యూ కడుతున్న నేపధ్యంలో మరి రజినీకాంత్ తో రాజమౌళి సినిమా ఎప్పుడు ఉంటుంది అంటూ రజనీకాంత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రాజమౌళి మీద ప్రెజర్ పెడుతున్నారు. నిజానికి రాజమౌళి తో సినిమా చేయాలంటే దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు అతనితోటి సరెండర్ అయి ఉండాలి.

    ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో రజనీకాంత్ మూడు నాలుగు సంవత్సరాల పాటు ఒక్క సినిమా మీద డేట్స్ కేటాయించే అవకాశాలైతే లేవు. ఎందుకంటే ఆయన ఇప్పుడు చేసే సినిమాలు చాలా చే తక్కువ…ప్రస్తుతం ఆయన రెండు మూడు సినిమాల కంటే ఎక్కువ చేసే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం ఆయనకి ఆరోగ్యం అనుకూలించడం లేదు. దాని వల్ల ఆయన కొంతవరకు రెస్ట్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…