https://oktelugu.com/

Chiranjeevi & Mahesh Babu : చిరంజీవి, మహేష్ బాబు కాంబోలో ఆ స్టార్ డైరెక్టర్ చేయాల్సిన సినిమా ఎందుకు క్యాన్సిల్ అయిందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ మూవీస్ కి భారీ డిమాండ్ అయితే పెరుగుతుంది. పాన్ ఇండియాలో రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లను పెట్టి భారీ మల్టీస్టారర్ సినిమా చేసినప్పటి నుండి ఎక్కడ చూసిన కూడా మల్టీస్టారర్ సినిమాల గురించే ప్రస్తావన వస్తుంది. అలాంటి సినిమాలు చేయడానికి ఆ హీరోలు ఉత్సాహాన్ని చూపించడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : November 6, 2024 / 08:02 AM IST

    Why the star director's film with Chiranjeevi and Mahesh Babu combo was cancelled..?

    Follow us on

    Chiranjeevi & Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేయడంలో చాలా వరకు కృషి చేశాయి. ఇక మొత్తానికైతే ఆయన సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉండడమే కాకుండా ఆయనలోని నటన ప్రతిభను బయటికి తీసి ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేశాయి. ఇక ఏది ఏమైనా కూడా దాదాపు 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్న చిరంజీవి ఇప్పటికి సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించడానికి చాలామంది హీరోలు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు చిరంజీవి కాంబోలో ఒక సినిమా తెరకెక్కాల్సింది. కానీ ఆ సినిమా అనుకోని కారణాలవల్ల ఆగిపోయిందనే విషయం మనలో చాలామందికి తెలియదు… ఇక మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వీళ్ళిద్దరూ హీరోలుగా ఒక సినిమా రావాల్సింది.

    ఇక ఇది భారీ మల్టీస్టారర్ సినిమా గా ప్లాన్ చేసిన కూడా ఇది కార్యరూపం దాల్చడంలో మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఇది మల్టీస్టారర్ సినిమాగా చేద్దామని త్రివిక్రమ్ చెప్పి చిరంజీవి, మహేష్ బాబు ఇద్దరిని తన కథతో ఒప్పించినప్పటికి ఆ సినిమా కొన్ని కారణాలవల్ల పట్టాలైతే ఎక్కలేదు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.

    కాబట్టి ప్రేక్షకులందరికి అంతగా తెలియదు.కానీ లోపల మాత్రం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయినప్పటికి ఏవో కొన్ని ఇష్యూస్ వల్ల మాత్రమే సినిమా బయటికి రాలేదు. ఒకవేళ ఈ సినిమా కనక తెరకెక్కి ఉంటే ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అయ్యేవని అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. ఇక తర్వాత త్రివిక్రమ్, మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమా చేసి ప్లాపులను మూట గట్టుకున్న విషయం మనకు తెలిసిందే.

    ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో స్టార్ హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్లు కూడా కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. మరి ఈ సినిమా చేయకపోవడం వల్లే ఇటు మహేష్ బాబుకి, అటు త్రివిక్రమ్ కి ఇద్దరికి కూడా గుంటూరు కారం కి సినిమాతో సరైన సక్సెస్ అయితే రాలేదు…