https://oktelugu.com/

Allu Arjun Pushpa 2 : పుష్ప 2 కి ఎందుకంత క్రేజ్…ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్ కొడతాడా..?

పుష్ప 2 సినిమా కోసం సుకుమార్ అహర్నిశలు కష్టపడుతున్నాడు. నిజానికి ఆయనలాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. పుష్ప పేరు చెప్పగానే ప్రతి ఒక్కరిలో గూస్ బంప్స్ వచ్చే విధంగా మొదటి పార్ట్ ని తెరకెక్కించాడు. ఇక ప్రస్తుతం సెకండ్ పార్ట్ ని అంతకుమించి తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపధ్యం లో ఈ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 22, 2024 / 01:18 PM IST
    Why the craze for Pushpa 2...Will Allu Arjun hit the industry with this movie..?

    Why the craze for Pushpa 2...Will Allu Arjun hit the industry with this movie..?

    Follow us on

    Allu Arjun Pushpa 2 :సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ‘పుష్ప 2’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మొత్తానికైతే తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆయన చేసే ప్రతి సినిమా కూడా ప్రేక్షకుడిని మెప్పించడంలో ఎక్కడ తడబాటు లేకుండా బెస్ట్ అటెంప్ట్ అయితే ఇస్తూ ఉంటాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన పుష్ప సినిమా సూపర్ సక్సెస్ అయింది. దానివల్ల పుష్ప 2 సినిమా మీద భారీ క్రేజ్ అయితే పెరుగుతుంది. ఇక ఇంతకుముందు ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ కానీ టీజర్ కానీ ప్రేక్షకులను విపరీతంగా అలరించడంతో ఈ సినిమా మీదే ప్రస్తుతం వాళ్ళ దృష్టి మొత్తాన్ని కేంద్రీకరించినట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించగలిగితే పాన్ ఇండియా మార్కెట్ లో అల్లు అర్జున్ తప్పకుండా స్టార్ హీరోగా, సుకుమార్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటారు.

    ముఖ్యంగా పుష్ప సినిమాకి ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఉన్న సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. మరి అలాంటి ఒక స్టార్ డమ్ ని అందుకున్న ఈ సినిమా నుంచి వస్తున్న సెకండ్ పార్ట్ ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమా మీద భారీ అంచనాలు పెరగడానికి కారణం ఏంటి అంటే సుకుమార్ అనే చెప్పాలి.

    ముఖ్యంగా సుకుమార్ రైటింగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన రాసిన రంగస్థలం సినిమా ఎంతటి పెను ప్రభంజనాలను సృష్టించిందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి ఒక దర్శకుడు చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద భారీ క్రేజ్ అయితే ఉంది.

    మరి మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు ఈ సినిమాతో మరొక పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఇక సుకుమార్ తన తరువాత సినిమాను మళ్లీ రామ్ చరణ్ తో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తాన్ని ఫైనల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది…