https://oktelugu.com/

Rajinikanth , Nagarjuna : కింగ్ నాగార్జునను రజినీకాంత్ ఎందుకు కొట్టాడు…కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న నటులు వైవిధ్యమైన పాత్రలను చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఒక పాత్ర నచ్చితే అది హీరో అయిన విలన్ పాత్ర అయిన నటించి మెప్పించడానికి వాళ్ళు ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక శుభ పరిణామమనే చెప్పాలి. ఎందుకంటే ఎంతసేపు హీరోలు గానే చేయడమే కాకుండా అప్పుడప్పుడు మంచి పాత్రలను కూడా పోషిస్తే వాళ్లకు నటులుగా కూడా మంచి గుర్తింపైతే వస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 30, 2024 / 12:55 PM IST

    Why did Rajinikanth hit King Nagarjuna...what was the reason..?

    Follow us on

    Rajinikanth , Nagarjuna : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ లాంటి నటుడు మరొకరు లేరు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా తమిళ్, తెలుగు రెండు భాషల్లో కూడా సూపర్ స్టార్ గా తన ఇమేజ్ ను సుస్థిరం చేసుకున్న రజనీకాంత్ 73 సంవత్సరాల వయసులో కూడా ఎవ్వరికి వినకుండా వరుస సినిమాలను చేస్తూ స్టార్ స్టేటస్ ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇదిలా ఉంటే  కూలీ సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని ఇండియాలో ఉన్న సీనియర్ హీరోలందరిలో తనే నెంబర్ వన్ హీరోగా కొనసాగాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికోసమే తీవ్రమైన కసరత్తులను చేస్తున్నాడు. అయితే నాగార్జున ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. కాబట్టి రజనీకాంత్ నాగార్జున మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉండబోతున్నట్టుగా దర్శకుడు లోకేష్ కనకరాజు ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మరి ఆయన చెప్పినట్టుగానే ఈ సినిమా ఉంటుందా? ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే లోకేష్ కనకరాజు కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ సాధిస్తే కెరీర్ అనేది టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. అందుకే ఆయన ఈ సినిమా మీద భారీ కసరత్తులను చేస్తున్నాడు.
    అయితే ఈ సినిమాలో నాగార్జునను ఏరి కోరి విలన్ గా పెట్టుకోవడానికి కూడా కారణం అదే అని తెలుస్తుంది. నాగార్జునతో కొత్తరకం విలనిజాన్ని పండించడానికి తను తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే రజినీకాంత్ నాగార్జునల మధ్య రీసెంట్ గా క్లైమాక్స్ ఫైట్ ను కూడా షూట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
    ఇక అందులో భాగంగానే రజినీకాంత్ నాగార్జునని కొట్టాడు అంటూ కోలీవుడ్ మీడియా కొన్ని కథనాలను వెలువరిస్తుంది. ఇక మొత్తానికైతే రజనీకాంత్ చేతిలో నాగార్జున దెబ్బలు తిన్నాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
    ఇక సినిమా పరంగానే రజినీకాంత్ నాగార్జునని కొట్టినప్పటికి ఒక స్టార్ హీరో గా వెలుగొందుతున్న నాగార్జున తను విలనిజాన్ని కూడా పండించడంలో దిట్ట అని తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి పాత్రను ఎంచుకున్నట్టుగా తెలియజేశాడు