Dhanush & Dulquer Salmaan : సినిమా ఇండస్ట్రీలో భారీ గుర్తింపును సంపాదించుకోవాలని ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఆరాటపడుతున్నాడు. అందుకోసమే తెలుగులో భారీ సినిమాలను చేస్తూ వాళ్లకు వాళ్ళు భారీ గుర్తింపును ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ధనుష్, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు వాళ్ళ సినిమాలను తెలుగులో డబ్ చేయడమే కాకుండా ఏకంగా తెలుగు దర్శకులతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయారు. నిజానికి వాళ్ళకి ఇక్కడ కూడా భారీ మార్కెట్ అయితే ఉంది. మరి ఆ మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికి వాళ్ళు మంచి సినిమాలను చేయడానికి ఇక్కడ ఉన్న యంగ్ డైరెక్టర్స్ తో మంతనాలు జరుపుకున్నట్టుగా తెలుస్తుంది… మరి వీళ్ల మాదిరిగానే మన హీరోలు ఇతర భాషల్లో సినిమాలు చేయడం లేదు. మన వాళ్లు అక్కడ మార్కెట్ ఎందుకు అందుకోవడం లేదు. ముఖ్యంగా యంగ్ హీరోలు తెలుగుకి మాత్రమే ఎందుకు పరిమితమవుతున్నారు. ఇతర భాషల్లోకి వెళ్లి అక్కడ ఉన్న దర్శకులతో సినిమాలు చేసి అక్కడ కూడా సక్సెస్ ని సాధించి మన సత్తా ఏంటో చూపించవచ్చు కదా అంటూ కొంతమంది సినీ విమర్శకులు మన యంగ్ హీరోల మీద భారీ విమర్శలు చేస్తున్నారు. మన దగ్గరికి వేరే వాళ్ళు వచ్చి సినిమాలు చేసి మన చేత శభాష్ అనిపించుకోవడమే తప్ప మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి శభాష్ అనిపించుకోలేమా..?
ఎందుకు మన వాళ్ళు ఇలాంటి ఒక నిర్లక్ష్యపు వైఖరిని పాటిస్తున్నారనేది ఎవరికి తెలియడం లేదు. నిజానికి మన హీరోలను ఇతర భాషల ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది కూడా తెలియదు. ప్రస్తుత సినిమా పాన్ ఇండియాలో సాగుతుంది. కాబట్టి మన స్టార్ హీరోలు మాత్రమే పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు.
మిగతా హీరోలు తెలుగు వరకే వాళ్ళ సినిమాలను పరిమితం చేస్తున్నారు. మరి ఇలాంటి యంగ్ హీరోలు ఒక తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా డైరెక్ట్ సినిమాలను చేయొచ్చు కదా! అలా అయితే తెలుగు సినిమా స్థాయి మరింత పెంచే అవకాశం ఉంటుంది.
మన నటులకు కూడా ఇండియా వైడ్ గా భారీ మార్కెట్ క్రియేట్ అవ్వడమే కాకుండా వాళ్ల ఫాలోయింగ్ కూడా పెరుగుతుందనే ఉద్దేశ్యంతో కొంతమంది సినీ మేధావులు మన హీరోలకి హితబోధ చేస్తున్నారు. మరి వాళ్ళు ఇప్పటికైనా ధనుష్, దుల్కర్ సల్మాన్ ల బాటలో నడుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…