Telugu News » Photos » Cinema Photos » Who is making negative comments on vishwambhara will chiranjeevi get success with this movie
Ad
Vishwambhara : విశ్వంభర మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నదెవరు..? ఈ సినిమాతో చిరంజీవి కి సక్సెస్ దక్కుతుందా..?
సినిమా ఇండస్ట్రీ అనేది ఏ ఒక్కరి సొంతం కాదు. సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్ లను సాధించి స్టార్ హీరోలుగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోతుంది అని ప్రూవ్ చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి..
Who is making negative comments on Vishwambhara..? Will Chiranjeevi get success with this movie?
Follow us on
Vishwambhara : సినిమా ఇండస్ట్రీలో దాదాపు 40 సంవత్సరాలుగా మెగాస్టార్ హోదాని అనుభవిస్తున్న ఏకైక హీరో చిరంజీవి…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాలని దిశగా ముందుకు దూసుకెళుతున్నాయి. నిజానికి ఆయన నుంచి ఒక సినిమా వచ్చింది అంటే చాలు ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఆంచనలైతే ఉంటాయి. ఇక ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హైలీ గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ గా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ని చూసిన ప్రతి ఒక్క అభిమాని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాతో చిరంజీవి భారీ సక్సెస్ అందుకోబోతున్నాడు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి మొత్తానికైతే మరి కొంతమంది మాత్రం ఈ సినిమాలోని గ్రాఫిక్స్ చాలా చీప్ గా ఉందని కామెంట్లు కూడా చేశారు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి మీద ఎప్పుడు కొంతమంది నెగటివ్ కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారనే విషయం మనందరికి తెలిసిందే.
ఇక విశ్వంభర సినిమా విషయంలో కూడా ఇలాంటి నెగటివ్ కామెంట్స్ రావడం పట్ల కొంతమంది భారీగా రియాక్ట్ అవుతున్నారు. నిజానికి ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా కథ ప్రకారం సినిమాలో గ్రాఫిక్స్ అయితే కీలకపాత్ర వహించబోతుంది. మరి అనుభవిజ్ఞులైన గ్రాఫిక్స్ డిజైనర్లతో సినిమా గ్రాఫిక్స్ డిజైన్ చేస్తున్నారు. అంతటి గ్రాఫిక్స్ డిజైన్ చేసిన కూడా కొంతమంది మాత్రం ఈ సినిమా మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ సినిమా యూనిట్ కూడా రీసెంట్ గా స్పందించారు.
మరి మొత్తానికైతే ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. భోళా శంకర్ సినిమాతో ఫ్లాప్ ని మూట గట్టుకున్న చిరంజీవికి ఈ సినిమా సక్సెస్ అనేది కీలకం కాబోతుంది. అలాగే పాన్ ఇండియాలో ఇప్పటివరకు ఆయన భారీ సక్సెస్ అయితే సాధించలేకపోయాడు. సైరా సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసినప్పటికీ ఆ సినిమా చిరంజీవి రేంజ్ లో లేకపోవడంతో యావరేజ్ గా నిలిచింది.
మరి ఇప్పుడు విశ్వంభర సినిమాతో ఆయన మరో భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ ఏజ్ లో కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చాలా కష్టపడుతున్న తీరు చూస్తుంటే మెగాస్టార్ అనే హోదాకి సరైన న్యాయం చేసే నటుడు కూడా తనే అనేది స్పష్టం గా తెలుస్తోంది…