https://oktelugu.com/

directors : ఈ టాప్ డైరెక్టర్లు మళ్ళీ మెగా ఫోన్ పట్టేది ఎప్పుడు..?సినిమా చేసేది ఎప్పుడు..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు సక్సెస్ ఫుల్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు ఈ హీరోలకు సక్సెస్ లను అందించిన దర్శకులను కూడా అస్సలు పట్టించుకోకుండా హీరోలు వాళ్ల స్వార్ధంతో ఎవరైతే ఫామ్ లో ఉన్నారో వాళ్లతోనే సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి అసక్తి చూపిస్తున్నారు... ఇక దీనివల్ల ఒకప్పటి స్టార్ డైరెక్టర్లు ఇప్పుడున్న స్టార్ హీరోలతో సినిమాలను చేయలేకపోతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 26, 2024 / 09:20 AM IST

    When will these top directors get a mega phone again..? When will they make a movie..?

    Follow us on

    directors : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది దర్శకులు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లుగా వెలుపొందిన చాలా మంది దర్శకులు ప్రస్తుతం మెగా ఫోన్ పట్టకుండా ఖాళీగా ఉన్నారు.నిజానికైతే స్టార్ హీరోలందరు ఫామ్ లో ఉన్న దర్శకులకి ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు. దానివల్ల ఒకసారి ఫెయిల్యూర్ దర్శకుడి గా ముద్ర పడిన డైరెక్టర్స్ కి హీరోలు మరో ఛాన్స్ ఇవ్వడానికి భయపడుతున్నారు. నిజానికి వివి వినాయక్, వంశీ పైడిపల్లి శ్రీకాంత్ అడ్డాల లాంటి దర్శకులు ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలను చేశారు. కానీ వాళ్లకి ఇప్పుడు ఏ హీరో నుంచి కూడా అవకాశలైతే రావడం లేదు.  కొంతమంది స్టార్ హీరోలైతే వీళ్ళ ఫోన్లు కూడా ఎత్తడం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
    ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే అందరూ పట్టించుకుంటారు. లేకపోతే మాత్రం ‘ఎవరికీ వారే యమునా తీరే’ అనే రేంజ్ లో మనల్ని ఎవరూ పట్టించుకోరు. ఇక ఇదిలా ఉంటే ఈ దర్శకుల అభిమానులు మాత్రం మా అభిమాన దర్శకుల సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. ఎవరితో స్టార్ట్ అవుతాయి అనేది తెలియక చాలా వరకు సతమతమవుతున్నారు  ఈ స్టార్ డైరెక్టర్లందరూ సినిమాలను రిలీజ్ చేసి దాదాపు సంవత్సరం పైనే అవుతున్నప్పటికీ ఎవ్వరి నుంచి కూడా సరైన రెస్పాన్స్ అయితే రావడం లేదు.
    మరి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ దర్శకులు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలను చేయడం బెస్ట్ అని మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరూ చాలా బిజీగా ఉన్నారు. వాళ్లు స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళకి అవకాశాలను ఇచ్చి మళ్లీ ప్లాప్ లను మూట గట్టుకునే సాహసమైతే వాళ్ళు చేయడం లేదు.
    ఇక సక్సెస్ ఫుల్ దర్శకులతో సినిమాలు చేస్తే వాళ్లకు కూడా మార్కెట్ అనేది భారీగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువగా జరుగుతుంది. దాని ద్వారా ప్రేక్షకుల్లో అటెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక వీళ్ళ మీద అంచనాలైతే తారాస్థాయిలో ఉంటాయనే చెప్పాలి. అందువల్లే సక్సెస్ ఉన్న దర్శకులతోనే హీరోలు ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉంటారు…