What is the relationship between Kooli movie and Leo movie..? Is Lokesh planning hard this time..?
Kooli : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్… ప్రస్తుతం ఈయన రజనీకాంత్ తో చేస్తున్న కూలీ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే రేకెత్తిస్తుంది. అలాగే ఈ సినిమాలో నాగార్జున విలన్ గా నటించడం కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో పాటుగా లోకేష్ కనకరాజ్ ఇంతకుముందు చేసిన లియో సినిమా కూడా అతనికి మంచి పేరు తీసుకొచ్చింది. లియో సినిమాకి కూలీ సినిమాకి మధ్య ఒక ఇంటర్నల్ కనెక్షన్ అయితే పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. అదేంటి అంటే లియో సినిమాలో హీరోయిన్ గా చేసిన త్రిష కి కూలీ సినిమాలో రజినీకాంత్ కి మధ్య ఒక కనెక్టివిటీ ని కలపబోతున్నడట. మరి ఇది లోకేష్ కనకరాజు యూనివర్స్ లో భాగంగానే చేస్తున్నానని కూడా లోకేష్ ఇంతకు ముందు చాలా స్పష్టంగా తెలియజేశాడు. మరి మొత్తానికైతే ఈ సినిమాలో రజనీకాంత్ తనదైన రీతిలో నట విశ్వరూపాన్ని చూపించాడానికి కూడా సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని అందుకుంటే రజినీకాంత్ పేరు మరొకసారి పాన్ ఇండియా లెవెల్లో మారు మరుగుతుందనే చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా కూడా రజనీకాంత్ లాంటి గొప్ప నటుడు ఈ ఏజ్ లో కూడా వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.
అయితే లోకేష్ కనకరాజ్ తనదైన రీతిలో సినిమాలను చేయడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక విక్రమ్ తో కమల్ హాసన్ కి భారీ సక్సెస్ ని అందించిన లోకేష్ కూలీతో రజనీకాంత్ కి అంతకుమించి సక్సెస్ ని అందించాలని చూస్తున్నాడు.
తద్వారా పాన్ ఇండియాలో తను కూడా స్టార్ డైరెక్టర్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే లోకేష్ కనకరాజ్ సినిమాల్లో ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఉంటాయో ఈ సినిమాలో అంతకుమించిన ఎలిమెంట్స్ తో సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు…చూడాలి మరి లోకేష్ కనకరాజు ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు.
తద్వారా తర్వాత ఆయన చేసే సినిమాలకు ఇది ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక రజినీకాంత్ కూడా లోకేష్ కనక రాజు మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే లోకేష్ ఈ సినిమాని చేసి భారీ సక్సెస్ ని అందిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…