https://oktelugu.com/

Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ కి తెలుగులో అంత మంచి క్రేజ్ రావడానికి కారణం ఏంటి..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో కొంతమంది యంగ్ హీరోలు తమదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. వైవిధ్యమైన పాత్రలను పోషించడంలో వాళ్ళు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నారు... ఇక అలాంటి వారిలో దుల్కర్ సల్మాన్ ఒకరు... ఈయన చేసే సినిమాలకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : October 29, 2024 / 12:13 PM IST

    What is the reason why Dulquer Salmaan got such a good craze in Telugu..?

    Follow us on

    Dulquer Salmaan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతర భాషల హీరోలు కూడా వచ్చి సూపర్ సక్సెస్ లనూ సాధిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక మలయాళ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు దుల్కర్ సల్మాన్… ప్రస్తుతం తెలుగులో కూడా తనదైన రీతిలో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా చాలా వైవిద్య భరితమైన కథాంశంతో రావడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా దుల్కర్ సల్మాన్ తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో పోటీపడుతూ మంచి ఇమేజ్ ను సంపాదించుకోవడం అనేది ఒకరకంగా ఆయనకు ప్లస్ అయినప్పటికి మన హీరోలకు చాలా వరకు మైనస్ అవుతుంది. మహానటి లాంటి సినిమాలో ఆయన నటన చాలా అద్భుతంగా ఉంది. సీతారామం సినిమాతో మరొక మెట్టు పైకి ఎక్కడనే చెప్పాలి. ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించడానికి మన ముందుకు రాబోతున్నాడు. ఇక దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేయడం వల్ల దర్శకులకు కొంతవరకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఆయన పాజిటివ్ నెగిటివ్ అనే తేడా లేకుండా ఎలాంటి పాత్రలో అయినా చేయడానికి రెడీగా ఉంటున్నాడు. కాబట్టి తన స్టార్ డమ్ గాని, తన మార్కెట్ గాని దర్శకులకు చాలా వరకు ప్లస్ అవుతుంది. కాబట్టి ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేయడం కూడా ఒక వంతుకు మనవల్లకు ప్లస్ అవుతుందనే చెప్పాలి. మన స్టార్ హీరోలు చేయాలేని పాత్రలను తను చేసి చాలా వైవిధ్యమైన నటనతో ఆ సినిమాలో సక్సెస్ ఫుల్ గా నిలుపుతున్నాడు.

    అందువల్లే దుల్కర్ సల్మాన్ కి తెలుగులో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. దర్శక నిర్మాతలు కూడా అతన్ని ఎంకరేజ్ చేయడానికి కారణం ఇదే… మరి ఇప్పుడు కూడా ఆయన మరికొన్ని భారీ సినిమాలను సెట్ చేసుకొని పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.

    తెలుగులో స్టార్ డైరెక్టర్లు గా గుర్తింపు పొందుతున్న కొంతమంది నటుల దర్శకత్వంలో నటించడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తెలుగులో కూడా తన హవాని చూపించడం అనేది ఒక దుల్కర్ సల్మాన్ కే సాధ్యమవుతుందని చెప్పాలి…

    తెలుగులోనే కాకుండా పాన్ ఇండియాలో ఉన్న పలు భాషల్లో కూడా నటించడానికి సిద్ధమవుతున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా ఎదగడమే కాకుండా తను చేసిన ప్రతి సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడంలో ఆయన చాలా వరకు కృషి చేస్తున్నాడు…