https://oktelugu.com/

Dhanush : ధనుష్ అలాంటి సినిమాలే చేయడానికి కారణం ఏంటి..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీకి రజనీకాంత్ అల్లుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ధనుష్ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు రజనీకాంత్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలను చేస్తూ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఆయనలో నటుడ్ కాదు డైరెక్టర్,రైటర్, సింగర్ కూడా దాగి ఉన్నాడనే విషయం మనకు తెలిసిందే. ఇక రకంగా చెప్పాలంటే ధనుష్ మల్టీ టాలెంటెడ్ అనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 / 01:04 PM IST

    What is the reason for Dhanush to do such films..?

    Follow us on

    Dhanush : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వాళ్ళు ఈ ఏజ్ లో కూడా సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక వాళ్ల తర్వాత విజయ్, అజిత్, సూర్య, విక్రమ్ లాంటి హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. ఇక వీళ్ళు కమర్షియల్ సినిమాలకి పెద్దపీట వేస్తూ వరుస సినిమాలు చేసి మంచి విజయాలను సాధించారు. ఇక వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. కానీ ధనుష్ మాత్రం వీళ్ళకి భిన్నంగా సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. లేకపోతే ఆయన సినిమాలు చేయడు. కాబట్టి అతను డిఫరెంట్ జానర్లలో ఎలాంటి సినిమాలయితే చేయాలో వాటిని సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ముఖ్యంగా ఆయన సినిమాలు రొటీన్ కి భిన్నంగా ఉంటాయి. అందువల్లే ఆయన నటుడిగా చాలా వైవిధ్యమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అవకాశమైతే దక్కింది. ఇక రీసెంట్ గా ఆయన దర్శకత్వంలో వచ్చిన రాయన్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు.

    మరి ఆయన లాంటి స్టార్ హీరో సినిమా మీద ఉన్న ప్యాషన్ తో డైరెక్షన్ చేసి ఒక డిఫరెంట్ మేకింగ్ స్టైల్ ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారనే చెప్పాలి. ధనుష్ లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక తెలుగులో ఇంతకుముందు సార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర ‘ అనే తెలుగు సినిమా చేస్తున్నాడు.

    ఇక ఇందులో ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ ను పోషించబోతున్నట్టుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో పెను సంచలనాన్ని సృష్టించినట్టైతే ధనుష్ మరోసారి స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకుంటాడు. ఇక కమర్షియల్ సినిమాలను చేయకుండానే స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న హీరోగా మనం ధనుష్ ని అభివర్ణించవచ్చు.

    ఆయన సినిమాల్లో చాలా రియలేస్టేక్ సన్నివేశాలు ఉండడమే కాకుండా సినిమా మొత్తం చాలా న్యాచురల్ గా ఉంటుంది. అందువల్లే ఆయనకి సినిమా ఇండస్ట్రీలో చాలా ఎక్కువ క్రేజ్ అయితే ఉంటుంది. ఇక ప్రస్తుతం యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో కూడా తనే కావడం విశేషం…