https://oktelugu.com/

Vijay Devarakonda & Sukumar : విజయ్ దేవరకొండ సుకుమార్ మధ్య ఏం జరిగింది…ఆ స్టార్ ప్రొడ్యూసర్ వల్లే వాళ్ల కాంబో చెడిపోయిందా..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు డైరెక్టర్ల హవా కొనసాగుతుంది. వాళ్లతో సినిమాలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగడం అనేది విశేషం... ఇక ఇదిలా ఉంటే పాన్ ఇండియాలో కూడా మన హీరోలు సత్తా చాటడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : October 25, 2024 / 05:51 PM IST

    What happened between Vijay Devarakonda Sukumar...did their combo get ruined because of that star producer?

    Follow us on

    Vijay Devarakonda & Sukumar :తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్  హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ… ఆయన చేసిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో తనకంటూ ఒక స్టార్ డమ్ ను విస్తరించుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేయబోయే సినిమాల మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ఇప్పుడున్న పరిస్థితిల్లో ఆయన కొంతవరకు ప్లాపులను మూట గట్టుకున్నప్పటికి ఇకమీదట రాబోయే సినిమాలతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధించాలనే దిశగా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే పుష్ప సినిమా షూట్ సమయంలోనే సుకుమార్ విజయ్ దేవరకొండతో తను ఒక సినిమా చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశాడు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ ని ఇవ్వలేదు. ఇక రీసెంట్ గా ఈ సినిమా క్యాన్సల్ అయింది అంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి విజయ్ దేవరకొండ లాంటి మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయడానికి సుకుమార్ ఆసక్తి చూపించడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఎందుకు ఆయన తన ఆలోచన విరమించుకున్నాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.పుష్ప సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఆయన విజయ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ అది కార్య రూపం దాల్చడం లేదు. ఏది ఏమైనా కూడా సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబో మిస్సవడం పట్ల తమ అభిమానులు చాలా వరకు నిరాశ చెందుతున్నారు.
    అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అవ్వడానికి స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ కూడా ఒక కారణమని తెలుస్తోంది. నిజానికి డైరెక్టర్ పరుశురాం కి అల్లు అరవింద్ కు మధ్య చాలా గొడవలు జరిగాయి. దాంట్లో విజయ్ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
    దానివల్లే అల్లు అరవింద్ సుకుమార్ తో చెప్పి ఈ ప్రాజెక్టు ను క్యాన్సిల్ చేయించాడు అంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక వీటి మీద తరుచుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే అయితే  రావడం విశేషం. మరి మొత్తానికైతే విజయ్ దేవరకొండ తను స్టార్ హీరోగా ఎదగాలి అంటే మాత్రం కొన్ని వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది.
     అలాంటి వాటివల్లే ఆయన అందివచ్చే అవకాశాలను కూడా చేజార్చుకుంటున్నాడు అంటూ మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా రాణించాలి అంటే మాత్రం తన తదుపరి సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది…