https://oktelugu.com/

Trivikram : ఆ హీరోని ప్రేమిస్తున్న త్రివిక్రమ్…ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులకు చాలా ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసే మాటలకు గాని, ఆయన చేసిన సినిమాలకు గాని ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియోన్స్ గాని, యూత్ లో గాని ఆయన సినిమాలకు క్రేజ్ రావడమే కాకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : October 29, 2024 / 10:44 AM IST

    Trivikram who loves that hero...so who is that hero..?

    Follow us on

    Trivikram : మాటల మాంత్రికుడి గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్…ఈయన కెరియర్ మొదట్లో సినిమాలకు కథ మాటలు అందిస్తూ రచయితగా తన స్టామినాను చూపించాడు. ఇక ఆ తర్వాత దర్శకుడి గా మారి పలు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా టాప్ డైరెక్టర్ గా కూడా ఎదిగాడు. ఇక ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి అల్లు అర్జున్ ఈ విషయం మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. ఇంతకుముందు మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ప్లాప్ అవ్వడంతో త్రివిక్రమ్ కి ఎక్కడలేని బాధలైతే వచ్చాయి. ఇక ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా ఖాళీగా లేకపోవడంతో అల్లు అర్జున్ మీదే ఆయన భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. మరి అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడా? లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు.
    అక్కడ దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతూ ఆయన చేసే సినిమాలు బాగుంటాయని చెప్పడమే కాకుండా ఆయన చేసే ప్రతి పాత్రలో కూడా అద్భుతంగా నటిస్తాడని చెప్పి తనను ప్రేమిస్తున్నట్టుగా ఒక మాట కూడా చెప్పాడు. నిజానికి ఇద్దరు ఒక జెండర్ లో ఉన్నారు కాబట్టి పర్లేదు గాని లేకపోతే పెళ్లి కూడా చేసుకునే వాన్ని అన్నట్టుగా త్రివిక్రమ్ మాట్లాడటం ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది…
    త్రివిక్రమ్ కి దుల్కర్ సల్మాన్ అంటే ఎంత ఇష్టమో ఆ మాటతోనే ఆయన చెప్పడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ కూడా వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఆయన సినిమా సినిమాకు మధ్య వేరియేషన్స్ అయితే చాలా బాగా చూపించుకుంటూ డిఫరెంట్ జానర్స్ ని టచ్ చేస్తూ వరుసగా సినిమాలు చేస్తూ  ముందుకు దూసుకెళ్తున్నాడు.
    ఇక ఏది ఏమైనా కూడా లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగులో తన సత్తా చాటుకున్న వాడవుతాడు. ఇక ఇప్పటికే మహానటి, సీతారామం లాంటి సినిమాలతో తెలుగులో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన ఇప్పుడు లక్కీ భాస్కర్ తో కూడా అదే ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతున్నాడు…