https://oktelugu.com/

Surya Kangua : సూర్య కంగువా సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో…ఇక రచ్చ రచ్చే…

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. వాళ్ల నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ ఉండడమే కాకుండా ఆ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 1, 2024 / 10:56 AM IST

    Tollywood star hero in Surya Kangua movie...Ika Raccha Racche...

    Follow us on

    Surya Kangua : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంతటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు సూర్య…ఈయన చేసిన ‘కంగువా ‘ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక నవంబర్ 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేసి భారీ సక్సెస్ ని సాధించడానికి మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా దీపావళి కానుకగా రావాల్సింది. కానీ దీపావళికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే ఉద్దేశ్యంతో ఇక ఈ సినిమా సోలో గా వస్తేనే బాగుంటందనే ఒకే ఒక కోరికతో ఈ సినిమాను నవంబర్ 14వ తేదీన రిలీజ్ కి ముస్తబ్ చేస్తున్నారు… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఏ మేరకు సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక సూర్య ఇప్పటివరకు పాన్ ఇండియాలో సినిమా చేయలేదు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరూ పాన్ ఇండియా జపం చేస్తూ పాన్ ఇండియా హీరోలుగా మారిపోతుంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ హీరో కూడా పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటలేకపోవడం విశేషము. అందుకే సూర్య ఇండియా వైడ్ గా తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే సూర్య మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది. తద్వారా తను రెమ్యూనరేషన్ కూడా భారీగా తీసుకునే అవకాశాలైతే ఉన్నాయి. ఇక అందుకోసమే ఈ సినిమా మీద ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. సూర్య ఫ్రెండ్ గా ఒక రెండు నిమిషాల పాటు కనిపించే పాత్రలో రామ్ చరణ్ నటించినట్టుగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి ఈ పాత్రని చాలా సస్పెన్స్ గా ఉంచి థియేటర్లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

    అందుకోసమే రామ్ చరణ్ అసలు చిత్ర యూనిట్ తో కలవడం కానీ మాట్లాడడం కానీ ఏది చేయడం లేదు. ఇది ఒక సస్పెన్స్ క్యారెక్టర్ గా తెరమీద చూసేవాళ్ళకు స్పెషల్ ట్రీట్ ఇస్తుందంటూ మేకర్స్ వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

    ఇక సూర్య రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్ కావడం వల్లే ఆయన ఆ సినిమాలో క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ చేస్తున్నాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…